అధిక ఫిస్కల్ లోటు ఋణ సంక్షోభానికి దారి -ఈనాడు

ఈ వారం ఈనాడు పత్రికలో ఫిస్కల్ డెఫిసిట్, రెవిన్యూ డెఫిసిట్ ల గురించి చర్చించాను. మార్కెట్ ఎకానమీ ఉన్న ఆర్ధిక వ్యవస్ధల్లో ఫిస్కల్ డెఫిసిట్ (కోశాగార లోటు) కు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. దేశంలో ఆర్ధిక సంక్షోభ పరిస్ధితులు నెలకొని ఉన్నప్పుడు, “మన ఎకనమిక్ ఫండమెంటల్స్ స్ధిరంగా ఉన్నాయి. ఇబ్బందేమీ లేదు” అని ఆర్ధిక మంత్రులు, ప్రధాన మంత్రులు మేకపోతు గాంభీర్యంతో చెబుతుంటారు. అలాంటి ఫండమెంటల్స్ లో ఫిస్కల్ డెఫిసిట్ ఒకటి. ప్రభుత్వాలు రాబడి కంటే ఖర్చు…

2జి స్పెక్ట్రం: జనవరి 11 లోపు వేలం వేయండి, లేదా… -సుప్రీం కోర్టు

2జి స్పెక్ట్రమ్ వేలం వేయడాన్ని పదే పదే వాయిదా వేయడం పట్ల సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆగస్టు 31 తో వేలం పూర్తి కావాలని సుప్రీం కోర్టు విధించిన గడువును వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కోర్టు మన్నిస్తూ జనవరి 11, 2013 లోపు వేలం ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించింది. జనవరి 18 కల్లా వేలంలో విజయం సాధించిన కంపెనీల జాబితా తనకు సమర్పించాలని కోరింది. లేనట్లయితే సంబంధిత అధికారులపై…

అప్పు, లోటులతో దివాళా వాకిట అమెరికా ఆర్ధిక వ్యవస్ధ

ప్రపంచంలో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధ అయిన అమెరికా ఆర్ధిక వ్యవస్ధ దివాళా వాకిట నిలబడి ఉంది. 2007-08 సంవత్సరాల్లో తలెత్తిన సంక్షోభం లాగానే మరో అర్ధిక సంక్షోభం ముంగిట వణుకుతూ నిలుచుంది. మరో ఆర్ధిక మాంద్యం (రిసెషన్) నుండి తప్పించుకోవడానికి అమెరికా కాంగ్రెస్, సెనేట్లలో రిపబ్లికన్లు, డెమొక్రట్లు సిగపట్లు పడుతున్నారు. బడ్జెట్ లోటును తగ్గించుకోవడానికీ, అప్పు పరిమితిని పెంచుకోవడానికి ఓ అంగీకారానికి రావడానికి శతధా ప్రయత్నిస్తున్నారు. అప్పు పరిమితి పెంపుపై ఒబామా హెచ్చరికలు, బడ్జెట్ లోటు తగ్గింపుపై…

బడ్జెట్ 2011-12 -సామాన్యుడికి మొండిచేయి, మార్కెట్ కి అభయ హస్తం

  భారత ప్రభుత్వ ఆర్ధిక నడక, మార్కెట్ ఎకానమీ వైపుకు వడివడిగా సాగిపోతోంది. బహుళజాతి సంస్ధల నుండి మధ్య తరగతి ఉద్యోగి వరకు ఎదురు చూసిన “బడ్జెట్ 2011-12” ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఫిబ్రవరి 28, 2011 తేదీన పార్లమెంటులో ఆవిష్కరించారు. ఎప్పటిలానే యూనియన్ బడ్జెట్ సామాన్యుడిని పట్టించుకుంటున్నట్లు నటిస్తూ, మార్కెట్ లో ప్రధాన పాత్రధారులైన స్వదేశీ ప్రైవేటు పెట్టుబడిదారుల నుండి విదేశీ బహుళజాతి సంస్ధల వరకు భారత దేశ కార్మికులూ, రైతులూ, ఉద్యోగుల రెక్కల…

తగ్గిపోతున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు – ప్రజల్ని పట్టించుకోని ప్రభుత్వ ఆర్ధిక సర్వే

  2011-12 ఆర్ధిక సంవత్సరానికి నూతన బడ్జెట్ రూపొందించడంలో భాగంగా భారత ప్రభుత్వం శుక్ర వారం ఆర్ధిక సర్వే వివరాలను వెల్లడించింది. కొత్త బడ్జెట్ ప్రకటించటానికి రెండు మూడు రోజుల ముందు ఆర్ధిక సర్వే ఫలితాలను ప్రకటిస్తారు. ఈ సర్వేలు సాధారణంగా పారిశ్రామిక ఉత్పత్తి, విదేశీ పెట్టుబడుల ప్రవాహం, జి.డి.పి పెరుగుదల, కరెంట్ ఎకౌంట్, ఎగుమతులు దిగుమతులు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ (చెల్లింపుల సమతూకం) మొదలైన వాటి ప్రస్తుత పరిస్ధితి వాటి మెరుగుదలకు తీసుకోవలసిన చర్యల పట్ల…

రానున్నది జన రంజక బడ్జెట్టేనట!

  మరో నాలుగు రోజుల్లో ఫిబ్రవరి 28 తేదీన 2011-12 ఆర్ధిక సంవత్సరం నిమిత్తం ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ జన రంజకంగా ఉండనున్నదని విశ్లేషకులు, వార్తా సంస్ధలు, ఉత్సాహ పరులు అంచనా వేస్తున్నారు. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కూడా ఆ మేరకు సూచనలు ఇస్తున్నాడని గురువారం నాటి ఆయన ప్రకటన ద్వారా అంచనా వేస్తున్నారు. జన రంజక బడ్జెట్ వలన కొత్త ఆర్ధిక సంవత్సరాంతానికి కోశాగార లోటు ప్రకటిత లక్ష్యం…