కోవిడ్ భవిష్యత్తు చెప్పే అర్హత బిల్ గేట్స్ కి ఎక్కడిది?

అమెరికా సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ గురించి తెలియని వారు ఉండరు. గూగుల్, ఫేస్ బుక్ లాంటి కంపెనీలు వచ్చేవరకూ ప్రపంచ సాఫ్ట్ వేర్ సామ్రాజ్యానికి ఆయన మకుటం లేని మహారాజు. అనేక మూడో ప్రపంచ దేశాల రాజకీయ నాయకులు కూడా ఆయనతో స్టేజి పంచుకోవటానికి ఉబలాట పడేవారు. కానీ మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రధాన ఉత్పత్తి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తనకు తెలిసింది తక్కువే అని ఆయన పలుమార్లు చెప్పుకున్నాడు. ఆరంభంలో…

ఒమిక్రాన్ పైన వ్యాక్సిన్ ప్రభావం లేదు -యూ‌ఎస్ స్టడీ

తాజాగా విస్తరిస్తున్న కొత్త రకం కోవిడ్ వైరస్ ఒమిక్రాన్. దీని దెబ్బకు పశ్చిమ దేశాలు అల్లాడుతున్నాయి. భారత దేశంలో ఒమిక్రాన్ విస్తరణ ఇంకా పెద్దగా నమోదు కాలేదు గానీ అమెరికా, ఐరోపా దేశాల్లో మాత్రం ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నట్లు అక్కడి పత్రికలు తెగ వార్తలు ప్రచురిస్తున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఒమిక్రాన్ రకం వైరస్ గురించి అదే పనిగా హెచ్చరిస్తోంది. ఉదాసీనత వద్దని, తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రకటనలు గుప్పిస్తోంది. మరోపక్క అమెరికాలో, జర్మనీ,…

ఇండియాలో ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్ వైరస్!

ప్రస్తుతం ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న కోవిడ్ వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత దేశంలో కూడా ప్రవేశించిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.రెండు కేసులూ కర్ణాటక రాష్ట్రంలో కనుగొన్నట్లు ప్రభుత్వం గురువారం తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ సోకిన ఇద్దరూ పురుషులే. ఒకరి వయసు 66 సం.లు కాగా మరొకరి వయసు 46 సం.లు. ఈ ఇద్దరి జాతీయత ఏమిటో వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో భారత పత్రికలు వెల్లడించడం లేదు. అయితే WION వెబ్ సైట్ అందజేసిన…

క్యూబా వాక్సిన్ రెడీ: ఫార్మా కంపెనీల గుండెల్లో గుబులు

కోవిడ్ 19 (సార్స్-కోవ్-2) వ్యాధి నిర్మూలనకై పశ్చిమ దేశాలకు చెందిన బడా కార్పొరేట్ ఫార్మా కంపెనీలు అనేక వ్యాక్సిన్ లు తయారు చేశాయి. అవసరమైన 3 దశల పరీక్షలు జరిపినట్లు చెప్పాయి. ఇక వైరస్ చచ్చినట్లే అని నమ్మబలికాయి. ఆ మేరకు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రియా, జర్మనీ తదితర ధనిక దేశాల అధిపతులు కూడా తమ తమ కంపెనీల తరపున సగర్వ ప్రకటనలు జారీ చేశారు. కానీ వైరస్ ఇంకా విస్తరిస్తూనే ఉన్నదని గణాంకాలు చెబుతున్నాయి. తయారైన…