అమెరికా-దక్షిణ కొరియా సైనిక విన్యాసాలతో కొరియాల వద్ద ఉద్రిక్తతలు
ఉభయ కొరియాల వద్ద అమెరికా సాగిస్తున్న ‘మిలట్రీ డ్రిల్’ (కోడ్ నేమ్ ఫోల్ ఈగిల్) ఉద్రిక్తతలు రెచ్చగొడుతోంది. మున్నెన్నడూ లేని విధంగా అణు బాంబులు జారవిడిచే బి-2 బాంబర్ యుద్ధ విమానాలను కొరియా భూభాగంపై ఎగరడంతో ఉత్తర కొరియా తీవ్రంగా స్పందించింది. కొరియా భూభాగంపై 10,000 కి.మీ ఎత్తు ఎగురుతూ బి-2 బాంబర్లు ‘మాక్ బాంబింగ్’ డ్రిల్ (పేలుడు పదార్ధాలు లేని బాంబు జారవిడిచి అది అనుకున్న చోట పడేదీ, లేనిదీ నిర్ధారించుకోవడం) నిర్వహించడంతో ఉత్తర కొరియా…