పుండు మీద కారం, మోడీ సర్వే!

  ప్రజల అభిప్రాయానికి విలువ లేదు. సామాన్య ప్రజల కష్టాల పట్ల సానుభూతి లేదు. వ్యతిరేక అభిప్రాయం పట్ల గౌరవం లేదు. ప్రజాస్వామ్యంలో విరుద్ధ అభిప్రాయాలకు స్ధానం ఇవ్వాలన్న జ్ఞానమే లేదు. నోట్ల రద్దు వల్ల కలిగే ప్రభావంపై ముందస్తు అంచనా లేదు, అధ్యయనం అసలే లేదు. కనీసం ఏర్పాట్లు లేవు. కోట్లాది మంది శ్రామిక ప్రజల కష్టార్జితాన్ని రాత్రికి రాత్రి రద్దు చేసి పారేసి నల్ల “ధనంపై పోరాటం” అని ప్రకటిస్తే జనం ఏమై పోతారన్న…

టెర్రరిస్టుల చేతుల్లో కొత్త 2 వేల నోట్లు!

పాత 500, 1000 నోట్లు రద్దు చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడి చెప్పిన కారణాల్లో ఒకటి: టెర్రరిజం ఫైనాన్స్ వనరులను దెబ్బ కొట్టడం. దొంగ నోట్లు, హవాలా డబ్బుతో సీమాంతర ఉగ్రవాదం లేదా పాకిస్తాన్ ప్రేరేపిత కాశ్మీర్ ఉగ్రవాదం పేట్రేగిపోతున్నదని, నోట్ల రద్దు ద్వారా టెర్రరిస్టు ఫైనాన్స్ వెన్ను విరిగిపోతుందని ప్రధాని పిడికిలి బిగించి మరీ చెప్పారు. ప్రధాని చెప్పడమే కాదు, నోట్ల రద్దు వలన కాశ్మీర్ లో టెర్రరిస్టు కార్యకలాపాలు హఠాత్తుగా ఆగిపోయాయని కూడా…

కొత్త నోట్లు: 2011 లోనే నిర్ణయం -అధికారులు

  సాధారణ పాలనా ప్రక్రియలో భాగంగా తీసుకునే నిర్ణయాలకు మసాలాలు అద్దడం, అబద్ధాలతో హైప్ సృష్టించడం, దేశానికీ ఎదో ఒరగబెట్టేసినట్లు నానా హంగామా చేయడం, పనిలో పనిగా మోడీ చుట్టూ కృత్రిమ ప్రతిష్టను నిర్మించడం, అవేవి వీలు కాకపొతే బాధితుడి పాత్రలోకి వెళ్ళిపోయి కన్నీళ్లు కార్చి సానుభూతి కోసం ప్రయత్నించడం..!  రు 500 , రు 1000 నోట్లు రద్దు చేయటం వెనుక లక్ష్యం నల్ల డబ్బుని వెలికి తీయడం అని కదా కేంద్ర ప్రభుత్వం, ప్రధాన…

కొత్త నోట్లు: ఆరు నెలలు పడుతుంది -ఆర్ధికవేత్తలు

  RBI నోట్ల ముద్రణా సామర్ధ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే పాత నోట్ల స్ధానంలో కొత్త నోట్లను పూర్తి స్ధాయిలో ప్రవేశపెట్టడానికి 6 నెలల కాలం పడుతుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఆర్ధిక సలహాదారుగా పని చేసిన సౌమిత్ర చౌదరి చెప్పారు. కాగా ప్రధాని మోడీ నిర్ణయం వల్ల అక్టోబర్ – డిసెంబర్ త్రైమాసికంలో భారత జీడీపీ అర శాతం తగ్గిపోతుందని జర్మనీ ఇన్వెస్టుమెంట్ బ్యాంక్ డ్యూష్ బ్యాంక్ AG అంచనా వేసింది.  బ్యాంకుల వద్ద…

కొత్త నోట్లు: సెక్యూరిటీ నాణ్యత రెండు లేవు, అన్ని అబద్ధాలే!

  పాత, పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పిన మాటలు ఏమిటి? దేశంలో నల్ల ధనం పేరుకుపోయింది. ధనిక వర్గాలు, మనీ లాండర్లు, హవాలా రాకెటీర్లు, సమాంతర ఆర్ధిక వ్యవస్ధని నడుపుతున్నారు. సరిహద్దుల అవతలి నుండి దొంగ నోట్లు ముద్రించి దేశంలోకి వదులుతున్నారు. ఫలితంగా ఆర్ధిక వ్యవస్ధకు నష్టం కలుగుతోంది. పేదలు ఎక్కువగా నష్టపోతున్నారు. సమానత్వం సాధించలేకపోతున్నాము. నల్ల డబ్బు జీడీపీ వృద్ధి రేటు పెంచుకోవటానికి ప్రధాన ఆటంకం అయింది. ఇక…