అవును! టెంప్లేట్ మళ్ళీ మార్చాను

టెంప్లేట్ ని మళ్ళీ మార్చాల్సి వచ్చింది. క్రితం టెంప్లేట్ లో ప్రధానమైన లోపం నేవిగేషన్ కష్టంగా ఉండడం. ‘పాత టపాల’ లోకి వెళ్లడానికి హోమ్ పేజీలో ఎక్కడా సౌకర్యం లేదు. ఇది నేవిగేషన్ కు బాగా ఇబ్బందిగా మారింది. దీనిని కవర్ చేయడానికి ‘ఈ బ్లాగ్ లో విహరించడం ఎలా?’ అన్న పేరుతో వివరణ ఇచ్చాను గానీ అదొక చాట భారతంలా కనిపించింది. కేవలం ‘స్లైడర్’ లో 20 టపాలను చూపించవచ్చు అనుకున్నాను గానీ అవి వెంటనే…

బహుశా, ఈ టెంప్లేట్ అందరికీ నచ్చుతుంది!

‘తెలుగువార్తలు డాట్ కామ్’ ఉరఫ్ ‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ’ బ్లాగ్ కోసం టెంప్లెట్ వేట ఇంకా ఆగిపోలేదు. ఆక్సిజన్ అలంకారం (అదేనండీ, ధీమ్ ఉరఫ్ టెంప్లేట్) కూడా ఎవరికీ పెద్దగా నచ్చలేదని అర్ధం అయిపోయింది. మిత్రులు ఆ సంగతి నేరుగా చెప్పలేక ‘అది ఉంది కానీ ఇది లేదు’ ‘ఫర్ఫాలేదు, కానీ అంతకుముందుదే బాగుంది’ లాంటి వ్యాఖ్యలతో తమ అసంతృప్తిని పరోక్షంగా చెప్పేశారు. నిజానికి ‘ఆక్సిజన్’ నాకూ నచ్చలేదు. వేణు గారు అన్నట్లు అది క్లమ్సీగా…

పోనీ, ఈ టెంప్లేట్ ఎలా ఉంది?

సెలెక్టా ధీమ్ మెజారిటీ పాఠకులకు నచ్చలేదని అర్ధం అయింది. ఒక్క తిరుపాలు గారు తప్ప ఇతర మిత్రులంతా బాగాలేదనే చెప్పారు. ముఖ్యంగా చందుగారు చెప్పినట్లు బ్లాగ్ లోని వివిధ టపాలకు తేలికగా ప్రవేశం ఉండేలా డిజైన్ ఉండడం చాలా అవసరం. అది సెలెక్టా ధీమ్ కి లేదని అర్ధం అవుతోంది. ఈసారి ఆక్సిజన్ ధీమ్ ని అమర్చాను. బహుశా ఇది బాగుందనుకుంటాను. దీని పైన కూడా మిత్రుల అభిప్రాయాలను కోరుతున్నాను.

‘తెలుగు వార్తలు’ కొత్త టెంప్లేట్, సూచనలివ్వండి!

సందర్శకులకు ఓ చిన్న విన్నపం! ‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ’ బ్లాగు కోసం కొత్త టెంప్లేట్ ను అమర్చాను. ఇది పాఠకులకు అనుకూలంగా ఉన్నదని నా అంచనా. కానీ పాఠకులకు అనుకూలంగా ఉందా లేదా అన్న సంగతి ప్రధానంగా పాఠకులు చెప్పాలి తప్ప నేను కాదు. అందుకే మీ సూచనలను ఆహ్వానిస్తున్నాను.