విద్యుత్ కోతలతో అల్లాడుతున్న తెలంగాణ

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతీకారం వల్లనోఏమో తెలియదు గానీ తెలంగాణ జిల్లాలు విద్యుత్ కోతలతో అల్లాడుతున్నాయి. డిమాండ్ కు సరఫరాకు మధ్య భారీ అంతరం తలెత్తడంతో వేసవి చాలా దూరం ఉన్నా అప్పుడే వేసివి తరహా కోతలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది. అధికారిక కోతలు పట్టణాల్లో రోజుకు 4 గంటలు అని ప్రకటించి అనధికారికంగా మరిన్ని గంటలు కోత విధిస్తున్నారు. పల్లెల గురించి చెప్పుకోకపోతేనే మేలు. తెలంగాణలో విద్యుత్ కోతలకు ప్రధాన బాధితులు అక్కడి రైతాంగం.…

కె.సి.ఆర్ దాయాది బాబు -కార్టూన్

“ఈయన ఆంధ్ర నుండి వచ్చిన మా కజిన్. కుటుంబ చర్చల కోసం మాత్రమే ఆయన ఇక్కడకు వచ్చారు” *** ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సలహా మేరకు దాయాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇరువురూ కలిసి కూర్చుని కష్ట, సుఖాలు మాట్లాడుకున్నారు. చర్చలు చాలా సుహృద్భావ వాతావరణంలో జరిగాయని ఇద్దరు సి.ఎం లూ చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ కు అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని కె.సి.ఆర్ అంగీకరించినట్లుగా కూడా ఎ.పి. సి.ఎం బాబు చెబుతున్నారు. చర్చల…

కె.సి.ఆర్ కారు Vs చంద్రబాబు కారు -కార్టూన్

కె.సి.ఆర్ కారు ఎక్కేశారు. డ్రైవర్ సీటు కూడా చేజిక్కించుకుని ప్రయాణం కూడా మొదలు పెట్టేశారు. అనగా సి.ఎంగా పదవీ స్వీకార ప్రమాణం చేసి, మంత్రివర్గం కూడా నియమించుకుని పాలన మొదలు పెట్టేశారు. కాబట్టి ఆయన వదులుతున్న వాగ్దానాలకు కాస్త అర్ధం వచ్చి చేరింది. అవి నెరవేరుస్తారా లేదా అన్నది తర్వాత సంగతి. రైతుకు 12,000 దాకా రుణం మాఫీ అంటున్నారు. ఉన్న పెట్టుబడులు ఎక్కడికీ వెళ్లొద్దని కోరారు. కొత్తవాళ్లు కూడా రావచ్చన్నారు. ప్రత్యేక హోదా తమకూ ఇవ్వాలని…

సామాజిక తెలంగాణా? కె.సి.ఆర్ తెలంగాణా? -కార్టూన్

నూతన రాష్ట్రం తెలంగాణ ఆవిర్భావాన్ని ది హిందూ కార్టూనిస్టు కేశవ్ ఇలా వ్యక్తీకరించారు. ఏమిటి దీనర్ధం? సామాజిక తెలంగాణను హామీ ఇచ్చిన కె.సి.ఆర్ తన కుటుంబ తెలంగాణ మాత్రమే ఇచ్చారనా? కె.సి.ఆర్ బలం అంతా తెలంగాణ మాత్రమే అనా? కె.సి.ఆర్ బలం తెలంగాణ వాపులోనే ఉందని, అది త్వరలో తగ్గిపోతుందని (వాపు తగ్గాక నూతన రాష్ట్రం వల్ల ఒరిగిందేమీ లేదని ప్రజలు తెలుసుకుంటారని) అర్ధమా? పాఠకుల్లో ఎవరన్నా చెప్పగలరా?

తెలంగాణ మొదటి అడుగు: కె.సి.ఆర్ వాగ్దాన ఉల్లంఘన

నూతన రాష్ట్రం తెలంగాణ ఆవిష్కృతం అయింది. ఉద్యమ పార్టీ నేతగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. 11 మంది మంత్రులతో కొలువు తీరిన నూతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో సహా ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. అనగా దాదాపు 25 శాతం ఒకే కుటుంబ మంత్రులతో కూడిన మంత్రివర్గాన్ని కొత్త రాష్ట్రం తలకెత్తుకుంది. తెలంగాణ ఉద్యమాన్ని సైతం కుటుంబ ఉద్యమంగా నడిపిన ఆరోపణలు ఎదుర్కొన్న కె.సి.ఆర్…

విభజన గోతిలో కాంగ్రెస్, ఒడ్డున కె.సి.ఆర్ -కార్టూన్

విభజన కోసం అహోరాత్రాలు శ్రమించిన కాంగ్రెస్ ను గోతిలోనే వదిలేసి విభజన ఫలాలను తాను మాత్రమే అందుకోవడం కోసం కె.సి.ఆర్ ప్రయత్నిస్తున్నారని కార్టూన్ సూచిస్తోంది. ఒడ్డు చేరేదాకా పడవ మల్లయ్య, ఒడ్డు చేరాక బోడి మల్లయ్య అయినట్లు! తెలంగాణ ఇస్తే టి.ఆర్.ఎస్ పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తానని కె.సి.ఆర్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. విలీనానికి కార్యకర్తలు ఒప్పుకోవడం లేదని కె.సి.ఆర్ ఇప్పుడు చెబుతున్నారు. కనీసం పొత్తుకి కూడా ఆయన అంగీకరించేట్లు లేరని కొన్ని పత్రికలు చెబుతున్నాయి.…

సోనియా చెయ్యి కట్టేసిన కె.సి.ఆర్? -కార్టూన్

తెలంగాణ ఇస్తే టి.ఆర్.ఎస్ ని కాంగ్రెస్ లో కలిపేస్తానని హామీ ఇచ్చిన కె.సి.ఆర్ ఇప్పుడు మొండి చెయ్యి చూపుతున్నట్లు ఈ కార్టూన్ సూచిస్తోందా? కానీ విలీనం చర్చలు జరుగుతున్నాయని నేడో, రేపో నిర్ణయం వచ్చేస్తుందని కదా పత్రికలు చెబుతున్నది? సోనియా ముందు టి.ఆర్.ఎస్ నేతలు ఒక వాదన ఉంచినట్లు కొద్ది రోజుల క్రితం ఒక ఊహాగానం వెలువడింది. దీని ప్రకారం విలీనం కంటే కలిసి పోటీ చేస్తేనే ఎక్కువ ఉపయోగం అని టి.ఆర్.ఎస్ నేతలు కాంగ్రెస్ కు…

తెలంగాణ ఈ నెల్లోనే -కె.సి.ఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు కె.చంద్రశేఖర్ రావు మరోసారి ప్రజలని మభ్యపెట్టే పనిలో పడినట్లు కనిపిస్తోంది. తెలంగాణ సమస్య ఈ నెలలోనే పరిష్కారం కానున్నదని ఆయన ప్రకటించాడు. ఢిల్లీకి ప్రయాణం కాబోతూ ఆయన పత్రికలు, చానెళ్ల ముందు ఈ అనూహ్య ప్రకటన చేశాడు. ఢిల్లీలో తెలంగాణ కోసం మూడు రోజులు దీక్ష చేసి జాతీయ పత్రికల దృష్టిని ఆకర్షించడంలో బి.జె.పి సఫలం అయిన నేపధ్యంలో కేంద్రీకరణను తనవైపు మళ్లించుకోవడానికే కె.సి.ఆర్ ఈ ప్రకటన చేశాడన్నది కొందరి అనుమానం.…