చెప్పులు కుట్టే మీకు యూనివర్సిటీ చదువులు కావాలా?

“మీరు హరిజనులు. చదవడానికి, రాయడానికి మీకు హక్కు లేదు. బూట్లు, చెప్పులు కుట్టడమే మీ పని. మా ఇళ్ళలో మిమ్మల్ని దాసులుగా ఉంచుకుంటాం. మీ తాత ముత్తాతలు చేసిన పని అదే. మీరు హాస్టల్ ని వదిలిపెట్టి వెళ్లిపోండి. లేదా, ఇక్కడ రక్తపాతం తప్పదు.” ఏ మారు మూల పల్లెలోనో అహం మూర్తీభవించిన అగ్రకుల భూస్వాములు పలికిన మాటలు కావు యివి. పాట్నా యూనివర్సిటీ విద్యార్ధుల ప్రేలాపనలు ఇవి. పాట్నా యూనివర్సిటీలో షెడ్యూల్డ్ కులాల విద్యార్ధులు నివసించే…

దండోరా వెయ్యనందుకు కట్టేసి కొట్టిన అగ్ర కులస్ధులు

కులవ్యవస్ధ అణచివేత తన వాస్తవ రూపంలోనే కొనసాగుతున్నదని కర్ణాటకలో జరిగిన ఘటన రుజువు చేస్తున్నది. సంప్రదాయక కులాచారం ప్రకారం దండోరా వెయ్యడానికి నిరాకరించాడని 38 సంవత్సరాల రంగస్వామిని అగ్రకులస్ధులు స్తంభానికి కట్టేసి చితకబాదారు. కొట్టాక కూడా దండోరా వేయడానికి ఒప్పుకోకపోతే అతని ఇద్దరు కూతుళ్లను కూడా కొడతామనీ, వారికి ప్రమాదం కలగజేస్తామనీ బెదిరించారు. రోజువారీ కూలి చేసుకుంటూ బతికే రంగస్వామి అగ్రకులజుల కులాధిపత్య దాడికి బలై చెన్నరాయపట్నం ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు. తన భర్తను అగ్రకుల పెత్తందారులు చెట్టుకు…

కుల వేధింపులతో దళిత పూజారి ఆత్మహత్య

కుల వివక్షతో ఆలయ పాలక సిబ్బంది పాల్పడుతున్న వేధింపులకు తట్టుకోలేక తమిళనాడులో 23 సంవత్సరాల దళిత పూజారి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పూజారి పదవినుండి తప్పుకోవాలనీ, అసలు గుడిలోకే రాకూడదనీ పాలక సిబ్బంది వేధించడంతో దళిత పూజారి ఎస్.నాగముత్తు మూడు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు పెట్టకుండా పట్టించుకోక పోవడంతో ఒక స్వచ్ఛంద సంస్ధ సాయంతో కోర్టుకి కూడా వెళ్ళాడు.  వేధింపులపై కేసు నమోదు చేసి విచారణ చేయాలని కోర్టు ఆదేశాలిచ్చినా వేధింపుల్లో మార్పులేకపోవడంతో…

ధర్మపురి కుల హింస: బంగారం, డబ్బు దోచుకుని తగలబెట్టారు -ఫోటోలు

ధర్మపురి జిల్లాలో కులాంతర వివాహం వల్ల జరిగిన కుల హింసలో దాడి చేసినవారు ఒక పధకం ప్రకారం వ్యవహరించారు. ప్రతి ఇంటిని వెతికి విలువైన వస్తువులను దోచుకున్నాకనే ఇళ్లను తగలబెట్టారని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ (టి.ఒ.ఐ) పత్రిక తెలిపింది. ఇళ్లతో పాటు ఇళ్లముందు ఉన్న వాహనాలను కూడా తగలబెట్టారని తెలిపింది. మొత్తం 268 ఇళ్ళను, 50 ద్విచక్ర వాహనాలను, నాలుగు వేన్లను తగలబెట్టారని డేషింగ్ టైమ్స్ పత్రిక తెలిపింది. దాదాపు 2500 మంది దాడిలో పాల్గొన్నారనీ, అప్పటికే…

దళితుడిని పెళ్ళాడితే దళిత కాలనీలు తగలబడతాయ్!

ఓ అగ్రకుల యువతి దళిత యువకుడిని వివాహం చేసుకున్నందుకు యువతి తండ్రి ఆత్మహత్య చేసుకోగా, యువతి కులస్ధులు మూకుమ్మడిగా దాడి చేసి దళితుల కాలనీని తగలబెట్టిన దుర్మార్గం తమిళనాడులో చోటు చేసుకుంది. కులం పరువుకోసం దళితుల ఇళ్లను తగలబెట్టిన ఈ సో కాల్డ్ అగ్రకులస్ధులు తగలబెట్టిన ఇళ్ళలో దోపిడీకి తెగబడి తమ పరువు ఎంత పాతాళంలోకి దిగబడి ఉందో చెప్పకనే చెప్పుకున్నారు. సాంస్కృతిక అభివృద్ధిలో ఉత్తరభారతం కంటే ముందున్నాయని చెప్పే దక్షిణ భారత రాష్ట్రాల్లోనూ అదే వెనుకబాటుతనం…

వేయి తలల హైందవ విషనాగుడి మరో వికృత శిరస్సు, ‘అస్పృశ్య గర్భం’

‘కుల వివక్ష’, వేయ పడగల హైందవ విషనాగు వికృత పుత్రిక అన్న నిజానికి సాక్ష్యాల అక్షయ పాత్రలు బోలెడు. ఎంతమంది ఎక్కినా పుష్పక విమానంలో మరొకరికి చోటు ఉంటుందో లేదో గానీ కులాల కాల కూట విషమే రక్తనాడుల్లో ప్రవహించే హైందవ విష నాగు కాట్లకు బలైన సాక్ష్యాలకు అంతూ పొంతూ లేదు. అండం తమదే, అండ విచ్ఛిత్తి చేసే వీర్యకణమూ తమదే… అయినా అండ వీర్య కణాల సంయోగ ఫలితమైన పునరుత్పత్తి కణాన్ని మోసే అద్దె…

‘ఆధునికత’ ముసుగులో మెట్రోల్లో కొనసాగుతున్న కుల, మత వివక్షలు -ది హిందూ

భారత దేశ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విజ్ఞానానికి రాజధానిగా భాసిల్లుతున్న బెంగుళూరు లో కుల, మతాల మూఢత్వం ‘ఆధునికత’ ముసుగులో పరిఢవిల్లుతోందని ‘ది హిందూ’ వెల్లడించింది. సామాజిక వ్యవస్ధల్లో మనుషుల మధ్య తీవ్ర వైరుధ్యాలకు కారణంగా నిలిచిన కుల, మతాలు కాల క్రమేణా బలహీనపడుతున్నాయన్న విశ్లేషణల్లో నిజం లేదని ‘ది హిందూ’ పత్రిక ప్రచురిస్తున్న పరిశోధనాత్మక కధనాల ద్వారా తెలుస్తోంది. భూస్వామ్య వ్యవస్ధ మూలాలయిన కులం, మత విద్వేషాలు ఆధునికతకు మారుపేరుగా భావించే మెట్రో నగరాల్లో బలహీనపడకపోగా యధాశక్తితో…

యు.పి.ఏ ప్రభుత్వంలో దళితుల గురించి పట్టించుకునే నాధుడే లేడు -అమెరికా రాయబారి (వికీలీక్స్)

  భారత దేశంలో అధికారంలో ఉన్న యు.పి.ఏ ప్రభుత్వం నిమ్న వర్గాలకు చాలా చేస్తున్నట్లు గప్పాలు కొట్టుకొంటుంది. ‘పనికి ఆహార పధకం’, ‘ఉపాధి హామీ పధకం’, తాజాగా ‘ఆహార భద్రతా చట్టం’ ఇలా దేశంలోని పేదవారి కోసం పలు పధకాలు రూపొందించి వారిని పైపైకి లాగడానికి తీవ్రంగ శ్రమిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సమయం వచ్చినప్పుడల్లా డబ్బా కొట్టుకుంటుంది. ఒక్క యు.పి.ఏ అనే కాదు. దానికి ముందు పాలించిన ఎన్.డి.ఏ, దానికి ముందు యునటెడ్ ఫ్రంట్, కాంగ్రెస్ తదితర…