ఓ పిరికి హృదయి, ఓ ప్రేమ హృదయాన్ని చంపేసింది -పునర్ముద్రణ
(2013లో సరిగ్గే ఇదే తేదీన ప్రచురించిన ఈ టపాను విషయ ప్రాధాన్యత రిలవెన్స్ రీత్యా పునర్ముదృస్తున్నాను. -విశేఖర్) ********** దివ్య, ఇలవరసన్! కులాంతర వివాహం చేసుకున్న ఈ జంట భవిష్యత్ సమాజానికి ఆదర్శంగా నిలవాల్సి ఉండగా కుల రాజకీయాల కోరల్లో చిక్కుకుని అత్యంత ఘోరమైన, క్రూరమైన, దయారహితమైన విషాదాంతం వైపుకి పయనించింది. కుల పార్టీల వలలో చిక్కి, ప్రాణ ప్రదంగా ప్రేమించిన భర్త దగ్గరకు వెళ్ళేది లేదని దివ్య నిర్దయగా ప్రకటించడంతో ఇలవరసన్ రైలు కింద పడి…