మొదట దళిత సమస్య, ఆ తర్వాతే విద్యార్ధి సమస్య!
రోహిత్ వేముల కులంపై చర్చ ఇంకా ముగియలేదు. పత్రికలు, ఛానెళ్లు, ప్రభుత్వాధికారులు, పోలీసులు ఈ సమస్యను ఇంకా కలియబెడుతూనే ఉన్నారు. రోహిత్ దళితుడా కాదా అన్నది అర్జెంటుగా తేల్చేయ్యాలన్నది కొందరి పంతంగా కనిపిస్తోంది. నిజం చెప్పాలంటే రోహిత్ దళితుడే అని నమ్ముతున్నవారికి ఎలాంటి సమస్యా లేదు. వారా చర్చలో నుండి ఎప్పుడో వెళ్ళిపోయారు. వారు రోహిత్ కు, అతనితో పాటు సస్పెండ్ అయినవారికి న్యాయం జరగాలన్న డిమాండ్ తో ఉద్యమంలో మునిగి ఉన్నారు. ఎటొచ్చీ రోహిత్ దళితుడు…