కులాంతర వివాహం: కూతురిని గోడకి కొట్టి చంపిన తండ్రి

ప్రేమ వివాహం చేసుకున్నందుకు తమిళనాడులో ఓ తండ్రి తన కూతురి తలను గోడకేసి కొట్టి చంపేశాడు. తల్లిదండ్రులకు చెప్పకుండా ప్రేమ వివాహం చేసుకుని తమ మానాన తాము బతుకుతున్న జంటను పోలీసులు వెతికి పట్టుకొచ్చి వారి వివాహాన్ని దగ్గరుండి మరీ రద్దు చేశారు. వివాహం రద్దుకు అమ్మాయి, అబ్బాయి ఇద్దరు మనఃపూర్వకంగానే అంగీకరించాని బంధువులు చెబుతున్నారు. పోలీసు స్టేషన్ లో వివాహం రద్దు చేయించి ఇంటికి వచ్చాక కూతురు మళ్ళీ అబ్బాయితో ఫోన్ లో మాట్లాడడం సహించలేని…

తమిళనాడులో ప్రమాదకర ధోరణి, దళితుల అణచివేతకు ఐక్యమవుతున్న కులశక్తులు

ధర్మపురి జిల్లాలో జరిగిన కులాంతర వివాహం, అనంతరం జరిగిన గృహ దహనాలు దళిత వ్యతిరేక కులదురహంకార శక్తుల ఐక్యతకు మార్గం వేసినట్లు కనిపిస్తోంది. అత్యంత వెనుకబడిన కులం (ఎం.బి.సి) గా తమిళనాడు ప్రభుత్వం గుర్తించిన వన్నియార్ కులసంఘాన్ని పునాది చేసుకుని దళితుల ఆత్మగౌరవ ప్రతిఘటనను అణచివేసేందుకు కులరాజకీయ శక్తులు కుట్రలు చేస్తున్నాయి. వన్నియార్ కులతత్వం ఆధారంగా ఆవిర్భవించి బలపడిన పి.ఎం.కె అనే రాజకీయ పార్టీ ఇటువంటి తీవ్ర అభివృద్ధి నిరోధకమైన ఎజెండాను తమిళనాడులో ప్రవేశపెట్టి సమాజ ప్రగతిని…

ధర్మపురి కుల హింస: బంగారం, డబ్బు దోచుకుని తగలబెట్టారు -ఫోటోలు

ధర్మపురి జిల్లాలో కులాంతర వివాహం వల్ల జరిగిన కుల హింసలో దాడి చేసినవారు ఒక పధకం ప్రకారం వ్యవహరించారు. ప్రతి ఇంటిని వెతికి విలువైన వస్తువులను దోచుకున్నాకనే ఇళ్లను తగలబెట్టారని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ (టి.ఒ.ఐ) పత్రిక తెలిపింది. ఇళ్లతో పాటు ఇళ్లముందు ఉన్న వాహనాలను కూడా తగలబెట్టారని తెలిపింది. మొత్తం 268 ఇళ్ళను, 50 ద్విచక్ర వాహనాలను, నాలుగు వేన్లను తగలబెట్టారని డేషింగ్ టైమ్స్ పత్రిక తెలిపింది. దాదాపు 2500 మంది దాడిలో పాల్గొన్నారనీ, అప్పటికే…

దళితుడిని పెళ్ళాడితే దళిత కాలనీలు తగలబడతాయ్!

ఓ అగ్రకుల యువతి దళిత యువకుడిని వివాహం చేసుకున్నందుకు యువతి తండ్రి ఆత్మహత్య చేసుకోగా, యువతి కులస్ధులు మూకుమ్మడిగా దాడి చేసి దళితుల కాలనీని తగలబెట్టిన దుర్మార్గం తమిళనాడులో చోటు చేసుకుంది. కులం పరువుకోసం దళితుల ఇళ్లను తగలబెట్టిన ఈ సో కాల్డ్ అగ్రకులస్ధులు తగలబెట్టిన ఇళ్ళలో దోపిడీకి తెగబడి తమ పరువు ఎంత పాతాళంలోకి దిగబడి ఉందో చెప్పకనే చెప్పుకున్నారు. సాంస్కృతిక అభివృద్ధిలో ఉత్తరభారతం కంటే ముందున్నాయని చెప్పే దక్షిణ భారత రాష్ట్రాల్లోనూ అదే వెనుకబాటుతనం…