చూడు చూడు నీడలు.. మూసాహార్ వాడలు -ఫోటోలు

వీళ్ళు మూసాహార్ అనబడే ఎలుకాహారులు. భోజ్ పురిలో ముసాహార్ అంటే ఎలుకల్ని తినేవారు అని. అదే వారి సమూహానికి పెట్టిన కులం పేరు. బీహార్ రాష్ట్రంలో నాగరికత నుండి దూరంగా వెలివేయబడ్డ ఈ కులం ప్రజలను భారత దేశ హిందూ సమాజం పంచములుగా గుర్తించి శతాబ్దాలు దాటిపోయింది. ఆధునిక భారతావని, సర్వ స్వతంత్ర గణతంత్ర సామ్యవాద లౌకికవాద రాజ్యంగా అవతరించాక  వారు షెడ్యూల్డ్ కులంగా గుర్తించ బడ్డారు. కానీ ఎన్ని పేర్లు పెట్టినా, ఓటు చట్టాలు చేసి…