కాగ్ ని బలహీనపరచడానికి ప్రభుత్వం ప్రయత్నం? -కార్టూన్
కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (CAG – కాగ్) రాజ్యాంగ బద్ధ సంస్ధ. ఎకౌంటింగ్ లెక్కలతో పాటు ప్రభుత్వ విధానాల ఫలితాలను కూడా ఆడిట్ చేసే హక్కు (దీనినే పెర్ఫార్మెన్స్ ఆడిట్ అని పిలుస్తున్నారు) కూడా కాగ్ కి ఉంది. గత రెండు మూడేళ్లుగా కోర్టులతో పాటు కాగ్ కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. దానితో ప్రభుత్వాలు నడుపుతున్న పెద్దల అవినీతి ఘనకార్యాలు పచ్చిగా వెలుగులోకి వస్తున్నాయి. వ్యక్తుల అవినీతితో పాటు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల అసలు స్వరూపం కూడా…