యజమాని గర్వం, పొరుగువాని అసూయ -కార్టూన్

– ‘Owner’s pride, neighbor’s envy.’ ఒనిడా టి.వి ప్రవేశపెట్టిన ఈ నినాదం దాదాపు సామెతగా మారిపోయింది. రాజకీయ, సామాజిక పరిస్ధితుల గురించి మాట్లాడుకునే సందర్భాల్లో కూడా ఇది సామెతగా చొరబడిందంటే అతిశయోక్తి కాదేమో! యు.పి.ఎ-2 ప్రభుత్వ పాలనలో వెల్లివిరుస్తున్న కుంభకోణాల జాతరను ప్రతిపక్ష పాలక వర్గాలు అసూయతో ఎలా వీక్షిస్తున్నదీ ‘ది హిందు’ కార్టూనిస్టు సురేంద్ర ఈ ‘సామెత కానీ సామెత’ ద్వారా ఈ కార్టూన్ లో చక్కగా వివరించారు. బోఫోర్స్ కుంభకోణం దేశ రాజకీయాలను…