హుస్సేన్ ఒబామాది ఏ మతం?

అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా మతం ఏమిటన్నది అనేకమంది అమెరికన్లకు ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్న. ఆయన ముస్లిం అని నమ్మేవారు అనేకమంది ఉన్నారు. ముఖ్యంగా రిపబ్లికన్ పార్టీని అభిమానించే అమెరికన్ ఓటర్లలో మెజారిటీ ఒబామా ముస్లిం మతానికి చెందిన కుటుంబం నుండే వచ్చారని గట్టిగా నమ్ముతున్నారు. ఆయనది ఏ మతమో తెలియదు అని చెప్పేవారిని కూడా కలుపుకుంటే ఆయన క్రైస్తవులు అని నమ్మనివారి సంఖ్య ఇంకా అనేక రెట్లు ఉంటుంది. బారక్ ఒబామా పూర్తి పేరు…

కీన్యా మారణకాండ: సైన్యమే మాల్ ని కూల్చేసిందా?

కీన్యా రాజధాని నైరోబిలో జరిగిన మారణకాండలో వాస్తవాలేమిటో చెప్పడానికి కీన్యా ప్రభుత్వం ఇంతవరకు ముందుకు రాలేదు. సోమాలియా నుండి వచ్చిన ఆల్-షబాబ్ టెర్రరిస్టులు ఈ దురాగతానికి పాల్పడ్డారని, పిరికిపందలను తరిమికొట్టామని ఆర్భాటంగా ప్రకటనలు ఇవ్వడం తప్ప దాడి ఎలా జరిగింది, అసలు మాల్ ఎందుకు, ఎలా కూలిపోయిందీ చెప్పడం లేదు. పేలుళ్ళ వేడికి భవనం బలహీనపడి కూలిపోయిందని కీన్యా ప్రభుత్వం చెబుతుండగా ఆల్-షబాబ్ ఇందుకు విరుద్ధంగా ప్రకటించింది. తమ సభ్యుల నుండి మాల్ ను విముక్తి చేయలేక…

హృదయం ద్రవించుకుపోయే కీన్యా మాల్ రక్తపాతం -ఫోటోలు

కీన్యా రాజధాని నైరోబిలోని ‘వెస్ట్ గేట్ మాల్’ పైన నాలుగు రోజుల పాటు జరిగిన రక్తపాతం నాగరిక ప్రపంచాన్ని నిశ్చేష్టుల్ని చేసింది. ఆల్-ఖైదా అనుబంధ సంస్ధ అయిన ఆల్-షబాబ్, ఈ దాడికి తానే బాధ్యురాలినని ప్రకటించింది. దాడిలో 61 మంది సాధారణ పౌరులు చనిపోగా ఇంకా 63 మంది జాడ తెలియలేదు. చనిపోయినవారిలో కిన్యా అధ్యక్షుడు కీన్యెట్టా రక్త సంబంధీకులు కూడా ఉన్నారు. ఆల్-షబాబ్ టెర్రరిస్టులు విసిరిన గ్రెనేడ్ల ధాటికి నాలుగు అంతస్ధుల మాల్ లోని మూడు…

ఒళ్ళు జలదరించే భయానక ఆఫ్రికా కరువు దృశ్యం -ఫోటోలు

ఆఫ్రికా కరువు గాధలకు అంతే ఉండదు. అంతులేని కధల సమాహారమే అఫ్రికా కరువు గాధ. కరువు, దుర్భిక్షం, యుద్ధం… ఇవి మూడూ అఫ్రికా దేశాలకు శనిలా దాపురించాయి. కనుచూపు మేరలో పరిష్కారం కనపడక శనిపై నెపం నెట్టేయడమే కాని ఆఫ్రికా కరువు మానవ నిర్మితం. లాభాల దాహం తప్ప మానవత్వం జాడలు లేని బహుళజాతి కంపెనీలు ఒకనాటి చీకటి ఖండంపై రుద్దిన బలవంతపు యుద్ధాలే ఈ అంతులేని కరువుకి మాతృకలు. లాభాల దాహం దోపిడికి తెగబడితే దాన్ని…