ఆఫ్ఘన్ చుట్టూ తిరుగుతున్న అమెరికా ఆత్మ!

బ్రతికున్నప్పుడు కోరికలు తీరని మనిషి చనిపోయాక దెయ్యమై అక్కడే తిరుగుతుంటాడని ప్రతీతి! ఆఫ్ఘనిస్తాన్ కు సంబంధించి అమెరికా వ్యవహారం అలానే ఉంది. టెర్రరిస్టు వ్యతిరేక పోరాటం పేరుతో ఆఫ్ఘన్ చుట్టుపక్కల దేశాలతో స్నేహ సంబంధాలు పెంచుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నదని తెలుస్తోంది. 20 యేళ్ళ పాటు ఆఫ్ఘనిస్ధాన్ ను దురాక్రమించి సాయుధంగా తిష్టవేసిన అమెరికా అక్కడి ప్రజలను నానా విధాలుగా పట్టి పల్లార్చింది. 70,000కు పైగా ఆఫ్ఘన్ పౌరులను బాంబుదాడులతో చంపేసింది. టెర్రరిస్టుల వేట పేరుతో అర్ధ రాత్రిళ్ళు…

మధ్య ఆసియా: మూసివేత దిశలో కిర్ఘిస్తాన్ అమెరికా ఆర్మీ బేస్

మధ్య ఆసియాలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. వచ్చే సంవత్సరం జులై నెల లోపుగా అమెరికా తన సైనిక స్ధావరాన్ని మూసేయాలని కిర్ఘిస్తాన్ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వబోతోంది. ఈ మేరకు పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెడుతున్నామని ఆ దేశ ప్రభుత్వ కేబినెట్ తెలిపింది. ఈ పరిణామంతో మధ్య ఆసియాలో ప్రభావం కోసం అమెరికా, రష్యాల మధ్య జరుగుతున్న పోటీలో రష్యా మరొకసారి పైచేయి సాధించినట్లే. కొద్ది సంవత్సరాల క్రితం అమెరికా మద్దతుతో తనతో యుద్ధానికి తలపడిన జార్జియాను…