జేమ్స్ ఫోలి చావు మరో వరల్డ్ వార్ కు దారి తీస్తుందా?

ఇస్లామిక్ స్టేట్/ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లేవంత్/ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా కు చెందిన మిలిటెంటు ఒకరు అమెరికా విలేఖరి జేమ్స్ ఫోలీ తలను కత్తితో కోసి చంపినట్లు చూపుతున్న వీడియో ఇటీవల ఇంటర్నెట్ లో ప్రత్యక్షం అయింది. ఈ వీడియోను సాకుగా చూపుతూ అమెరికా మళ్ళీ మధ్య ప్రాచ్యంలో మరో యుద్ధానికి నగారా మోగిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ఒబామా, బ్రిటన్ ప్రధాని కామెరాన్ లు యుద్ధ జ్వర పీడితులైనట్లుగా ప్రకటనలు గుప్పిస్తుండగా…

సిరియా తరలి వెళ్ళిన రష్యా యుద్ధ నౌక ‘డిస్ట్రాయర్’

రష్యన్ నేవీ కి చెందిన యుద్ధ నౌక సిరియా ఓడ రేవు కి బయలుదేరినట్లు రష్యా మిలట్రీ అధికారులు తెలిపారు. గత వారాంతంలో నల్ల సముద్రంలోని సేవాస్టోపోల్  స్ధావరాన్ని డిస్ట్రాయర్ వదిలి వెళ్లిందని వారు తెలిపారు. మధ్యధరా సముద్రంలోని సిరియా ఓడరేవు ‘టార్టస్’ కు అది మరి కొద్ది రోజుల్లో చేరుకుంటుందని తెలుస్తోంది. ముందుగా అనుకున్న ‘మిలట్రీ డ్రిల్లు’ లో ‘డిస్ట్రాయర్’ పాల్గొంటుందని రష్యా మిలట్రీ ని ఉటంకిస్తూ ‘డి డెయిలీ స్టార్’ పత్రిక తెలిపింది. సిరియాలో…

మరో హత్యా కాండ, ఈ సారి సిరియాలో

ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా సైనికులు ఆఫ్ఘన్ పౌరులను ఊచకోత కోసిన రెండవ రోజే సిరియాలో పౌరుల ఊచకోత జరిగింది. సిరియాలో జొరబడి సంవత్సర కాలంగా అద్దె తిరుగుబాటు నడుపుతున్న పశ్చిమ దేశాల కిరాయి మూకలు తాజాగా ఈ హత్యా కాండకు పాల్పడ్డాయని సిరియా ప్రభూత్వ మీడియాను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. ఐక్యరాజ్య సమితి మాజీ అధ్యక్షుడు కోఫీ అన్నన్ సిరియా సందర్శిస్తున్న సందర్భంలో ఆయనను ప్రభావితం చేయడానికే విదేశీ కిరాయి మూకలు ఈ హత్యాకాండకి దిగాయని సిరియా…