ఉత్తర కొరియా ఏమి ఆశిస్తోంది? -3

[ఉత్తర కొరియా వ్యాస పరంపరలో ఇది మూడవ భాగం. -విశేఖర్] ************* ఇప్పటి ఉత్తర కొరియా సోషలిస్టు దేశం కాదు. ఆ దేశ పాలకులకు సోషలిస్టు సమాజాన్ని నిర్మించే లక్ష్యం ఏమీ ప్రస్తుతం లేదు. కిమ్ జోంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ హయాం లోనే ఉత్తర కొరియాలో మార్కెట్ సంస్కరణలు ప్రారంభం అయ్యాయి. పెట్టుబడిదారీ దేశాల అండతో పెట్టుబడిదారీ అభివృద్ధి వైపు త్వరత్వరగా ప్రయాణం చేయాలని ఉత్తర కొరియా పాలకులు ఆశిస్తున్నారు. అయితే వారు…

ఉత్తర కొరియాపై సామ్రాజ్యవాద యుద్ధ మేఘాలు?!

గత కొద్ది నెలలుగా అంతర్జాతీయ వార్తల్లో ఉత్తర కొరియా ఒక ప్రధాన అంశంగా వార్తల్లో నానుతోంది. ఈ వార్తలను ప్రధానంగా సృష్టిస్తున్నది అమెరికా, ఐరోపాలకు చెందిన బహుళజాతి కార్పొరేట్ మీడియా కంపెనీలు. కాగా ఇండియాతో సహా ఇతర మూడో ప్రపంచ దేశాలలోని చిన్నా, పెద్దా వార్తా సంస్థలన్నీ ఈ వార్తా కధనాలను క్రమం తప్పకుండా మోసి పెడుతున్నాయి. వాస్తవాల జోలికి పోకుండా అవాస్తవాలనే వాస్తవాలుగా నెత్తి మీద వేసుకుని ప్రచారం చేస్తున్నాయి. భారత దేశంలో అయితే ప్రాంతీయ…

ఉత్తర కొరియా: ఓ యువ నియంత దృశ్య కధ

వర్తమాన చరిత్రలో నియంతృత్వం-ప్రజాస్వామ్యంల మధ్య సరిహద్దు రేఖ చెరిగిపోయి ఉంది. అతి పెద్ద ప్రజాస్వామ్యం అనీ, సుదీర్ఘ ప్రజాస్వామ్యం అనీ చెప్పుకునే దేశాల్లో ప్రజల ప్రయోజనాలకు కాణీ విలువ కూడా లేదు. నియంతృత్వ ప్రభుత్వాలుగా సో కాల్డ్ ప్రజాస్వామ్య దేశాలు ముద్రవేసిన దేశాల్లో ప్రజలకు కనీస సౌకర్యాలకు కొదవలేని పరిస్ధితి. సద్దాం హుస్సేన్ నాయకత్వంలో ఇరాక్ దేశం అన్నీ విధాలుగా అభివృద్ధి చెంది ఉండేది. చమురు వనరులను ప్రతి పైసాను దేశం దాటి పోనివ్వనందుకు సద్దాం హుస్సేన్…

ఉ.కొరియా అణు సామర్ధ్యంపై అమెరికాలో విభేదాలు

ఉత్తర కొరియా అణు క్షిపణులు అమెరికా భూభాగాన్ని చేరగలవా లేదా? చేరగలిగితే ఎక్కడి వరకు రాగలవు? పశ్చిమ తీర ప్రాంతం అయిన అలాస్కా వరకేనా లేక ప్రధాన భూభాగాన్ని కూడా చేరగలవా? అసలు ఖండాంతర క్షిపణులు మోసుకెళ్లగల తక్కువ సైజు అణు బాంబులను ఉత్తర కొరియా అభివృద్ధి చేసుకున్నదా? ఇవి అమెరికా ప్రభుత్వాన్ని తొలుస్తున్న ప్రశ్నలు. అణ్వస్త్ర సామర్ధ్యాన్ని ఉత్తర కొరియా రుజువు చేసుకున్నప్పటికీ వాటిని మోసుకెళ్లే ఖండాంతర క్షిపణులు ఎంత దూరం వెళ్లగలవనేది అంతర్జాతీయ పరిశీలకులు…

ఉభయ కొరియాల వద్ద యుద్ధ పరిస్ధితులు

ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. దక్షిణ కొరియా, అమెరికాలు మళ్ళీ సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టడంతో ఉత్తర కొరియా తీవ్రంగా ప్రతిస్పందిస్తోంది. గతంలో ఎన్నడూ లేనట్లుగా అమెరికా బి-2 బాంబర్లు కొరియా గగనతలం పైన ఎగరడంతో ఉత్తర కొరియా కలవరపాటుకు గురవుతోంది. ఆ దేశ అత్యున్నత మిలట్రీ కమాండ్ అత్యవసర సమావేశం జరిపి అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఖండాంతర క్షిపణులను అప్రమత్త స్థాయికి చేర్చుతున్నట్లు ప్రకటించింది. అమెరికా భూభాగం…

ఉత్తర కొరియా ఆర్మీ చీఫ్ తొలగింపు, రాజకీయ విశ్లేషకులు అప్రమత్తం

ఉత్తర కొరియా నుండి ఊహించని వార్త వెలువడింది. మిలటరీ చీఫ్ ‘రి యాంగ్-హో’ ను అనారోగ్య కారణాల రీత్యా పదవి నుండీ, ఇతర అన్ని అధికార పదవులనుండీ తొలగించినట్లు ప్రభుత్వ వార్తా సంస్ధ కె.సి.ఎన్.ఎ ప్రకటించింది. సెంట్రల్ మిలటరీ కమిషన్ కు వైస్ ఛైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్న రీ, అధికార పార్టీ వర్కర్స్ పార్టీలోనూ అనేక పదవులు నిర్వహించిన సీనియర్ నాయకుడు. రీ తొలగింపు ‘అసాధారణం’ గా దక్షిణ కొరియా కొరియాల ‘ఏకీకరణ మంత్రిత్వ శాఖ’…