తగు మూల్యం చెల్లించిన భద్రతా బలగాలు -ది హిందు ఎడిట్

(మాచిల్ బూటకపు ఎన్ కౌంటర్ కేసులో కోర్టు మార్షల్ జరిగిన పర్యవసానంగా ఐదుగురు సైనికులకు జీవిత ఖైదు శిక్ష పడింది. ఈ శిక్షను చూపిస్తూ AFSPA ను రద్దు చేయనవసరం లేదని మాజీ ఆర్మీ అధిపతి, ప్రస్తుత ఉప విదేశీ మంత్రి  జనరల్ వి.కె.సింగ్ అప్పుడే ప్రకటించేశారు. ఈ పరిణామంపై ది హిందు ప్రచురించిన సంపాదకీయం. -విశేఖర్) కాశ్మీర్ లో బూటకపు ఎన్ కౌంటర్ కు పాల్పడినందుకు గాను 4 రాజ్ పుటానా రైఫిల్స్ కు చెందిన…

ప్రశ్న: ఆర్టికల్ 370 కాశ్మీర్ కి అవసరమా?

ఉమేష్ పాటిల్: ఆర్టికల్ 370 గురించి వివరించండి. కాశ్మీర్ కి అది అవసరమా? సమాధానం: జమ్ము & కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించినదే ఆర్టికల్ 370. 1949 నుండి ఇది ఉనికిలో ఉన్నప్పటికీ ఈ ఆర్టికల్ నిజంగా ఊపిరి పీల్చుకుని సజీవంగా నిలిచిన రోజులు మాత్రం చాలా తక్కువే. వివిధ ఒప్పందాల పేరుతోనూ, రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారానూ ఈ ఆర్టికల్ ద్వారా కాశ్మీర్ కు కల్పించిన అధికారాలు అన్నింటిని కత్తిరించేశారు. ఆర్టికల్ 370 జీవచ్ఛవంగా…

కాశ్మీర్: ఎఎపి ఆఫీసు దాడి, హిందూ రక్షా దళ్ నేత అరెస్ట్

బుధవారం ఉదయం ఘజియాబాద్, కౌసాంబి లోని ఎఎపి ప్రధాన కార్యాలయం పైన హిందూ రక్షా దళ్ పేరుతో 40 మందితో కూడిన మూక దాడి చేసింది. అక్కడ ఉన్న పూల కుండీలను వాళ్ళు పగల గొట్టారు. పార్టీ ఫ్లెక్సీలను చించేశారు. తలుపులు, కిటికీలకు ఉన్న అద్దాలను పగల గొట్టారు. ఇక హిందూ మతాన్ని కాపాడుతాం… లాంటి నినాదాలు మామూలే. సుప్రీం కోర్టు ఎదురుగా ఉన్న తన కార్యాలయంలోకి రెండేళ్ల క్రితం జొరబడి దాడి చేసి కొట్టింది కూడా…

ఎఎపి కాశ్మీరు (ద్వంద్వ) విధానం -కార్టూన్

“మన కాశ్మీరు పాలసీ పైన జనాభిప్రాయం ఏమిటో ఎస్.ఎం.ఎస్, ట్విట్టర్ ల ద్వారా తెలుసుకోవాల్సింది కాదా?” – కాశ్మీరు విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ తన సాధారణ విధానం నుండి పక్కకు తప్పుకుంది. ప్రతి పనికీ ప్రజల అభిప్రాయాన్ని కోరే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అటువంటి విధానం కాశ్మీరు ప్రజలకు మాత్రం వర్తించదని తన వింత విధానం ప్రకటించారు. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ద్వంద్వ విధానం కలిగి ఉందన్నట్లే, ముఖ్యంగా కాశ్మీరు విషయంలో.…