పాక్ వరద గేటు తెరిచిన మోడి బలోచ్ వ్యూహం

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తల పెట్టిన వ్యూహం -కాంగ్రెస్ ఆరోపించినట్లుగా- ఇండియాకే బెడిసి కొట్టేట్లు కనిపిస్తోంది. 69వ స్వతంత్ర దినం నాడు బలోచిస్తాన్ ప్రజల పోరాటాన్ని మన ప్రధాని ప్రస్తావించినందుకు ప్రతీకారంగానా అన్నట్లుగా కాశ్మీర్ విషయంలో పూర్తి స్ధాయి అంతర్జాతీయ దౌత్య యుద్ధానికి పాకిస్ధాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ నడుం బిగించారు. కాశ్మీర్ సమస్య విషయమై తమ వాదన వినిపించడానికి వివిధ దేశాలకు ఆయన దౌత్యవేత్తలను పంపించారు. కాశ్మీర్ సమస్యను ఇతర దేశాలకు…

నిజాయితీ గల ‘మౌత్ పీస్’ -కార్టూన్

“నిజాయితీ మౌత్ పీస్ లు ఇంకా ఎవరన్నా ఉన్నారా?” — కాంగ్రెస్ పార్టీ ముంబై విభాగం ‘కాంగ్రెస్ దర్శన్’ పేరుతో ఒక పత్రిక నడుపుతుంది. ఈ పత్రిక ఇటీవల కాశ్మీర్ పట్ల నెహ్రూ విధానాన్ని విమర్శిస్తూ ఒక ఆర్టికల్ ప్రచురించింది. ఆ ఆర్టికల్ ఎవరు రాశారో పేరు వేయలేదు. అప్పటి హోమ్ మంత్రి వల్లబ్ భాయ్ పటేల్ సలహాలను పెడ చెవిన పెట్టి అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ కాశ్మీర్ సమస్యపై ఐక్య రాజ్య…

కాశ్మీర్ లో వింత ప్రభుత్వం -కార్టూన్

ఎన్నికలు జరిగిన 2 నెలలకు గాని జమ్ము & కాశ్మీర్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడలేదు. రాష్ట్ర ప్రజలు ఏ పార్టీకి మెజారిటీ ఇవ్వకపోవడంతో, ముఖ్యంగా సెక్యులర్ ముద్ర కలిగిన కాంగ్రెస్ ప్రభ పడిపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు విపత్కరమైన ఆటంకాలు ఎదురయ్యాయి. ఈ ఆటంకాలే కారణం అవునో కాదో ఇదమిద్ధంగా చెప్పలేం గానీ, ఓ వింత ప్రభుత్వం ఏర్పడిందన్న ఆలోచన మాత్రం పలువురికి కలుగుతోంది. వింత ప్రభుత్వం అనడం ఎందుకంటే ‘ఒక అంగీకారానికి వచ్చాం, కనీస ఉమ్మడి కార్యక్రమం…

అఫ్జల్ గురు ఉరి: మన బద్ధ శత్రువు కూడా మెరుగుగా చేసి ఉండడు

భారత దేశంలోనే ప్రముఖ న్యాయ నిపుణుడుగా (జ్యూరిస్టుగా) పేరు ప్రఖ్యాతులు పొందిన ఫాలి నారిమన్ కాశ్మీరు జాతీయుడు అఫ్జల్ గురు ఉరితీత పైన స్పందించారు. సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ చానెల్ లో కరణ్ ధాపర్ నిర్వహించే ‘డెవిల్స్ అడ్వొకేట్’ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వాన్ని కడిగేశాడు. అఫ్జల్ కుటుంబానికి సరైన సమాచారం ఇవ్వకుండా గుట్టు చప్పుడు కాకుండా ఉరితీసి పాతిపెట్టడం పట్ల అసంతృప్తి ప్రకటించారు. మానవతకు భారత దేశ సాంప్రదాయంలో అత్యున్నత స్ధానం ఉన్నదని, ఫోన్ చేసి చెప్పగల సమాచారాన్ని స్పీడ్…

కీచులాటలు ఇండియా, పాక్ లవి, కాశ్మీర్ రొట్టె ఐరాసకు

రెండు పిల్లుల రొట్టె తగాదాని కోతి తీర్చినట్లయింది ఇండియా, పాకిస్థాన్ దేశాల పరిస్ధితి. కాశ్మీర్ లో ఐక్యరాజ్యసమితి పరిశీలక బృందం కొనసాగాలా లేదా వద్దా అని ఇండియా, పాకిస్థాన్ లు కీచులాడుకుంటుంటే ఆ సంగతి తేల్చవలసింది మీ ఇద్దరిలో ఎవ్వరూ కాదు మేమే అని ఐరాస తేల్చి చెప్పింది. అమెరికా, యూరప్ దేశాలకు ప్రపంచ స్థాయిలో రాజకీయ ముసుగుగా పనిచేసే ఐరాస చేతి లోకి ఒక అధికారం వెళ్ళడం అంటే అది అమెరికా, యూరప్ చేతుల్లోకి వెళ్ళినట్లే.…