కాశ్మీర్ వరదలు: పట్టించుకునేవారు లేరు

“ఒక్క రాయి విసిరినా, ఆ ఒక్క వ్యక్తిని కొట్టడానికి వందల మంది పోలీసులు పరుగెట్టుకుని వస్తారు. వాళ్ళంతా ఇప్పుడేరి? మంత్రులు ఎక్కడ?” కాశ్మీర్ వరదల నుండి బైటపడిన ఒక కాశ్మీరీ టీచర్ వేసిన ప్రశ్నలివి. “హెలికాప్టర్లు వచ్చాయి, వెళ్ళాయి. మా సహాయం కోసం ఎవ్వరూ రాలేదు. మా ఏరియాలో ఎవ్వరినీ హెలికాప్టర్ల ద్వారా రక్షించలేదు” తాత్కాలిక శిబిరంలో తలదాచుకుంటున్న ఒక కాశ్మీరీ పౌరుడు వెల్లడించిన సత్యం. “ఈ ప్రభుత్వం ఇచ్చే ఆహారం మాకు అక్కర్లేదనీ జనం నిరాకరిస్తున్నారు.…

కాశ్మీర్ వరదలు గ్లోబల్ వార్మింగ్ పుణ్యమే -ఫోటోలు

కనీవినీ ఎరుగని భారీ వర్షాలు తెరిపిడి పడినా, జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రాన్ని కష్టాలు వీడలేదు. ఆకాశం భళ్ళున బద్దలయినట్లు కురిసిన వర్షపు నీరు కొండలనుండి కాశ్మీరు లోయలోకి దొర్లిపడుతూ పెను వరదలను సృష్టించింది. అనేక గ్రామాలు ఇంకా నీట మునిగి ఉన్నాయి. తాము ఇప్పటివరకూ 50,000 మందిని రక్షించామని సైన్యం ప్రకటించింది. అనేక వేలమంది ఇంకా  వరదల్లో చిక్కుకుని ఉన్నారు. అనేకమంది ఇళ్లపైనా, చెట్లపైనా నిలబడి సహాయం కోసం ఎదురుచూస్తున్నారని బైటపడ్డవారు తెలియజేస్తున్నారు. మరణాల సంఖ్య…

జమ్ము&కాశ్మీర్ వరదలు: 120 మంది దుర్మరణం -ఫోటోలు

జమ్ము & కాశ్మీర్ రాష్ట్రం గత వారం రోజులుగా భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అయింది. రాష్ట్ర ప్రజలు 120 మందికి పైగా ఈ వరదల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారిలో ఎక్కువమంది కొండచరియలు విరిగిపడడం, ఇళ్ళు కూలిపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయినవారే. సైన్యం అపూర్వ సాహసంతో రక్షణ చర్యలు చేపట్టారని చెబుతున్నప్పటికీ ప్రాణ నష్టం అధికంగానే ఉంది. వరదలు ఎంత తీవ్ర స్ధాయిలో వెల్లువెత్తాయంటే సరిహద్దు భద్రతా దళాలను సైతం అక్కడి నుండి ఖాళీ చేయవలసి…