పాక్ ఉల్లంఘనల మధ్య మోడి బిజీ -కార్టూన్
ఇక్కడ రాష్ట్రాల ఎన్నికలను చూసుకోవడమా, అక్కడ సరిహద్దులో పాకిస్ధాన్ కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలను పట్టించుకొనడమా? ‘కిం కర్తవ్యం’ అన్న సంకట కాలాన్ని ప్రధాని నరేంద్ర మోడి ఎదుర్కొంటున్నారని కార్టూన్ సూచిస్తోంది. ఎన్నికల వేళ కావడంతో ప్రతిపక్ష పార్టీ నేత రాహుల్ గాంధీ సైతం పాక్ ఉల్లంఘనలను తమ పార్టీ ప్రయోజనాలకు అనువుగా ఉపయోగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక పక్క పాకిస్ధాన్ కాల్పుల్లో ప్రజలు, సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే “అంతా సవ్యంగానే ఉంటుంది” అని ప్రధాని ప్రకటనలు…