సిరియాలో ఎగదోసిన మంటలు ఫ్రాన్స్ లోకి!

ఉగ్రవాద పెనుభూతం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. దాని ఫలితంగానే ప్యారిస్ పైన టెర్రరిస్టు దాడి జరిగిపోయింది. మానవత్వం మరిచిపోయిన కిరాతక ఉగ్రవాదులు అత్యంత సుందర నగరం ప్యారిస్ పై దాడి చేసి రక్తపాతం సృష్టించారు. 130 మందిని పొట్టన బెట్టుకున్నారు. సంగీత తరంగంలో మునిగిన వారిని, క్రీదానందంలో ఉన్నవారినీ, షాపింగ్ కు వచ్చినవారిని… వారూ వీరు అని లేకుండా అమాయకుల రక్తాన్ని చవిచూచారు. సోషలిస్టు భావ తరంగం ఊపిరి పోసుకున్న నేల ఉగ్ర మూకల పదఘట్టనలతో మైలపడిపోయింది!…

సిరియా, ఇరాక్ తిరుగుబాట్లు: పశ్చిమ దేశాల యు టర్న్

సిరియా తిరుగుబాటుదారులను పోరాటయోధులుగా కీర్తించిన పశ్చిమ దేశాలు ఇప్పుడు టెర్రరిస్టులు అంటున్నాయి. ఇరాక్ ను దురాక్రమించి ఉండగా అమెరికా విడుదల చేసిన అల్-బఘ్దాది ‘ఇస్లామిక్ స్టేట్’ (ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) ను స్ధాపించి సిరియా, ఇరాక్ ప్రాంతాలతో ‘కాలిఫేట్’ ఏర్పాటు చేసినట్లు ప్రకటించాక ‘ఆల్-ఖైదా కంటే తీవ్రమైన ఉగ్రవాది’ అని అమెరికా అంటోంది. ఐరాస భద్రతా సమితి వేదికగా బ్రిటన్ ప్రతిపాదించిన తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా పశ్చిమ దేశాలు జబ్బత్ ఆల్-నుస్రా, ఇస్లామిక్ స్టేట్ లను…