సత్యంకు పడింది పెద్ద శిక్షేనా? -కార్టూన్

రామలింగ రాజు సోదరులు, ఇతర పెద్ద మనుషులకు అవినీతికి పాల్పడినందుకు గాను హై కోర్టు శిక్షలు ప్రకటించింది. అత్యధికంగా 7 సం.ల జైలు శిక్ష + 5.5 కోట్లు జరిమానా విధిస్తూ తీర్పు ప్రకటించింది. ఈ శిక్షలను చూసి అందరూ సంతోషిస్తున్నారు. తగిన శిక్ష పడిందని వ్యాఖ్యానిస్తున్నారు. అసలు సత్యం కంపెనీ అధిపతి రామలింగ రాజు బృందం పాల్పడిన అవినీతికి పడిన శిక్ష మొత్తం కార్పొరేట్ అవినీతికి పడవలసిన శిక్షతో పోల్చితే ఎంత చిన్న దెబ్బతో సమానమో…

కాంట్రాక్టు నిబంధనలను రిలయన్స్ ఉల్లంఘించింది -కాగ్ అక్షింతలు

భారత దేశ రాజ్యాంగసంస్ధ, ప్రభుత్వ ఉన్నత ఆడిటింగ్ సంస్ధ అయిన ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’ రిలయన్స్ ఇండస్ట్రీస్ కాంట్రాక్టు ఉల్లంఘనలపై తన పూర్తి నివేదికను గురువారం సమర్పించింది. ఈ నివేదికలో కేంద్ర ప్రభుత్వం, రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండింటినీ కాగ్ విమర్శించింది. కాంట్రాక్టు నిబంధనలను ఉల్లంఘించినందుకు కంపెనీకీ, రిలయన్స్ కంపెనీ నిబంధనలను ఉల్లంఘించేలా సహకరించినందుకు ప్రభుత్వానికీ అక్షింతలు వేసింది. దేశానికి చెందిన కీలకమైన ఆయిల్ వనరు కృష్ణ-గోదావరి (కె.జి) బేసిన్ అభివృద్ధి చేసే కాంట్రాక్టు రిలయన్స్ ఇండస్ట్రీస్…