చిట్ ఫండ్ మోసానికి మమత పొగాకు పరిష్కారం -కార్టూన్

జనం బాధలంటే రాజకీయ నాయకులకు ఎంత చులకనో! ప్రజల కష్టాలకు వారు ఎదుర్కొంటున్న మోసాలకు సానుభూతి పలుకుతూనే వారి పరిస్ధితి పైన కుళ్ళు జోకులు వేయడం నాయకులకు తేలికైన విషయం. తాజాగా మమతా బెనర్జీ కూడా ఇలాంటివారి జాబితాలో చేరిపోయారు. పశ్చిమ బెంగాల్ లో శారదా చిట్ ఫండ్స్ సంస్ధ బోర్డు తిప్పేయడంతో లక్షలాది జనం దాచుకున్న సొమ్ము కోల్పోయి గొల్లుమంటున్నారు. మోసపోయిన వారి కోసం 500 కోట్ల రూపాయల కార్పస్ నిధి ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి…