mamata_cartoon

మమత ఫాసిస్టు పోకడ -కార్టూన్

మమత ఫాసిస్టు పోకడలు కొనసాగుతున్నాయి. తన పై గీసిన కార్టూన్ ను ఫార్వర్డ్ చేసినందుకు యూనివర్సిటీ ప్రొఫెసర్ ను అరెస్టు చేయించింది. తన ప్రతిష్టను మసకబార్చడానికి కుట్రలు జరుగుతున్నాయంటూ యధావిధిగా తన చర్యను సమర్ధించుకుంది. జాదవ్ పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అంబికేష్ మహాపాత్ర, ఆయన ఇంటిపక్కనే నివసిస్తున్న సుబ్రత సేన్ గుప్తా లను శుక్రవారం బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి మమత పరువు భంగం, మహిళ ప్రతిష్టకు మచ్చతేవడం, హేకింగ్ లాంటి సెక్షన్లను ప్రొఫెసర్ పై…

pacific competition

పసిఫిక్ లో అమెరికా, చైనా పోటీ -కార్టూన్

సాపేక్షికంగా చూస్తే చైనా ఇప్పుడు ప్రపంచంలో ప్రధానమైన ఆర్ధిక శక్తి. జిడిపి లో అమెరికా తర్వాత స్ధానం చైనాదే. చాలా తక్కువ కాలంలో అది ఈ స్ధానం చేరుకుంది. చైనాకు విదేశాలతో ఉన్న సంబంధాలు ప్రధానంగా వ్యాపారానికి సంబంధించినవే. చైనా విదేశాంగ విధానం ప్రో యాక్టివ్ కాదు. మిలట్రీ చర్యలు తీసుకునైనా వాణిజ్య సంబంధాలు కాపాడుకునే విదేశాంగ విధానం చైనా రూపొందించుకోలేదు. కాని అమెరికా అలా కాదు. దాని విదేశాంగ విధానం పూర్తిగా జోక్యం దారీ విధానమే.…

Modi not guilty

మోడీకే పాపమూ తెలియదట -కార్టూన్

సుప్రీం కోర్టు నియమించిన ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం’ (సిట్) మోడి కి ఏ పాపమూ తెలియదని తేల్చేసింది. హిందూ మూకల చేత పన్నెండొందలకు పైగా ముస్లింలు ఊచకోత కోయబడ్డ గుజరాత్ మారణ కాండకు సంబంధించి మోడిని ప్రాసిక్యూట్ చేయడానికి తగిన ఆధారాలేవీ కనిపించలేదట. నెలల తరబడి సాగిన మానవ హననంలో పసి పిల్లలు, ముసలివాళ్ళు, స్త్రీలు, గర్భిణీ స్త్రీలు అత్యంత పాశవికంగా హత్యలకు గురయినప్పటికీ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ కూచుంది. అయినా రాష్ట్ర ముఖ్య మంత్రికి…

Too-Big-To-Jail

వాల్ స్ట్రీట్: టూ బిగ్ టు జెయిల్ -కార్టూన్

2008 లో సంభవించిన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం దెబ్బకు ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధ ఇంకా కోలుకోలేదు. పొదుపు ఆర్ధిక విధానాలను రుద్దుతూ తాత్కాలికంగా సంక్షోభాన్ని కార్మిక వర్గంపైకి నెట్టేసిన వాల్ స్ట్రీట్ కంపెనీలు మళ్లీ లాభాలు పుంజుకున్నప్పటికీ ప్రభుత్వాలు ఇంకా బక్క చిక్కే ఉన్నాయి. ట్రిలియన్ల కొద్దీ డాలర్లను అప్పులు తెచ్చి అమెరికా, యూరప్ ప్రభుత్వాలు వాల్ స్ట్రీట్ ను బయటపడేశాయి. కాని అత్యాశతో అనేక అక్రమ వ్యాపార పద్ధతులను అవలంబించి, చట్టాలను తుంగలో తొక్కిన బడా…

economic-bright-side

తీవ్ర స్ధాయిలో అమెరికా మాంద్యం -కార్టూన్

అమెరికా మాంద్యం (రిసెషన్) తీవ్రమవుతోందని ఆర్ధికవేత్తలు, రేటింగ్ సంస్ధలు హెచ్చరికలు తీవ్రం చేస్తున్నాయి. నిరుద్యోగం స్వల్పంగా తగ్గుతున్నట్లు ప్రభుత్వ లెక్కలు చూపుతున్నప్పటికీ ఉద్యోగాలు వస్తాయన్న ఆశలు వదులుకుని అనేకమంది దరఖాస్తు చేయడం మానేయడం వల్లనే నిరుద్యోగం తగ్గుతున్నట్లు కనిపిస్తున్నదని వారు చెబుతున్నారు. పరిస్ధితి తీవ్రంగా ఉన్నప్పటికీ ఫెడరల్ బ్యాంక్ అధిపతి బెన్ బెర్నాంక్, ట్రెజరీ సెక్రటరి తిమోతి గీధనర్ లు ఆశావహంగా ఉన్నట్లు ప్రకటిస్తున్నారు. అమెరికాకి చెందిన ఈగాన్-జోన్స్ క్రెడిట్ రేటింగ్ సంస్ధ మూడు రోజుల క్రితం…

War-Drums

(ఇరాన్) వార్ డ్రమ్స్ -కార్టూన్

వియత్నాంలో పరాభవం ఎదురైంది. ఇరాక్ లో చావు తప్పి కన్ను లొట్టబోయింది. వెనిజులాలో తరిమి తరిమి కొట్టారు. బొలీవియా ‘ఛీ ఫో’ అంటోంది. ఆఫ్ఘనిస్ధాన్ లో ఉతికి ఆరేస్తున్నారు. సిరియా ప్రజల్లో వినేవాడే లేడు. అయినా అమెరికా పాలకులకి సిగ్గూ లజ్జా లేకుండా పోయాయి. ఇరాన్ పై దురాక్రమణ దాడికి ‘వార్ డ్రమ్స్’ మోగిస్తోంది. – –

Tatra trucks deal - General's attack

టాట్రా అవినీతి, ఆర్మీ చీఫ్ అటాక్ -కార్టూన్

టాట్రా ట్రక్కుల కొనుగోలుకోసం రు.14 కోట్లు లంచం ఇవ్వజూపారని ఆరోపించిన ఆర్మీ ఛీఫ్ వి.కె.సింగ్ ఆరోపణ చేసినపుడు పేరు చెప్పలేదు. ఇప్పుడు సి.బి.ఐ కి ఫిర్యాదు చేస్తూ తనకు లంచం ఇవ్వబోయిన వ్యక్తి ‘లెఫ్టినెంట్ జనరల్ తేజీందర్ సింగ్’ అని స్పష్టం చేసాడు. (తేజీందర్ సింగ్ ఇప్పటికే వి.కె.సింగ్ పై పరువు నష్టం దావా వేశాడు) తన తదనంతరం ఆర్మీ ఛీఫ్ కానున్నవారిలో రెండవ స్ధానంలో ఉన్న బల్వీందర్ సింగ్ పైన సి.బి.ఐ విచారణకు ఆదేశించిన సంగతి…

Obama-Decorations

అధ్యక్షుడుగా ఒబామా సాధించేమిటి? -కార్టూన్

ఇరాక్, ఆఫ్ఘన్ యుద్ధాలు ముగించి అమెరికా సైనికుల్ని తిరిగి స్వదేశం రప్పిస్తానని గత అధ్యక్ష ఎన్నికల్లో వాగ్దానం చేసిన బారక్ ఒబామా మళ్ళీ ఎన్నికలు వస్తున్నా తన హామీ నిలుపుకోలేదు. పైగా పదవిని అధిష్టించినవెంటనే ఆఫ్ఘనిస్ధాన్ కి ‘ట్రూప్ సర్జ్’ పేరుతో మరో 30,000 సైనికుల్ని పంపించాడు. అధ్యక్ష ఎన్నికలు జరిగే 2012 చివరి నాటికి ఈ ముప్ఫై వేలమంది సైనికుల్ని ఉపసంహరిస్తున్నానని గత సంవత్సరం ప్రకటించాడు. అంటే, ఎన్నికల సంవత్సరంలో ‘సైనికుల ఉపసంహరణ’ పేరుతో తాను…

Jobs and wars

ఉద్యోగాలు, యుద్ధాలు -కార్టూన్

దురాక్రమణ యుద్ధాలవల్ల ఆర్ధిక వ్యవస్ధలు కులారిల్లుతున్నప్పటికీ, అవే యుద్ధాల వల్ల కంపెనీల లాభాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న పరిస్ధితి ఉంది. యుద్ధాలు చేసి దురాక్రమించి ప్రపంచ వనరులు గుప్పెట్లో పెట్టుకోవడం పశ్చిమ దేశాల ‘మిలట్రీ-ఇండస్ట్రియల్ కాంప్లెక్స్’ దురాశ కాగా, యుద్ధాలకు ఎదురొడ్డి నిలిచే శక్తుల వల్లా, యుద్ధోన్మాదుల అదుపులో లేకుండా పోయే యుద్ధ ఖర్చుల వల్లా ఆర్ధిక సంక్షోభాలు అనివార్యంగా ఎదురవుతున్న పరిస్ధితి. ఈ పరిస్ధితుల్లో నిరుద్యోగ సైన్యానికి ఉద్యోగాలు దొరకడం దుర్లభం అవుతున్నా, యుద్ధాలు మాత్రం…

Perfect war

పక్కా యుద్ధం (Perfect war) -కార్టూన్

– “పక్కా యుద్ధాన్నే మేం ప్రారంభించాం! ఇప్పుడంతా యుద్ధంలో మునిగిపోయారు. కాని తమ శత్రువు ఎవరో ఇప్పుడు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు” – ‘టెర్రరిజం పై యుద్ధం’ పేరుతో అమెరికా ప్రారంభించిన యుద్ధానికి ఇప్పుడు దిక్కూ, దరీ లేదు. ‘టెర్రరిస్టులపై యుద్ధమే’ లక్ష్యం అయితే ఆ లక్ష్య శుద్ధి ప్రారంభంలోనే లేదు. ఆల్-ఖైదాతో యుద్ధం అని చెప్పి, అదే ఆల్జ్-ఖైదాతో కుమ్మక్కై ప్రభుత్వాలు ఏర్పరుస్తున్నారు. ఆఫ్ఘనిస్ధాన్ లో ఆల్-ఖైదాతో యుద్ధం, లిబియాలో ఆల్-ఖైదాతో కుమ్మక్కై…

Budget 2012-13

2012-13 బడ్జెట్ -కార్టూన్

(ఫస్ట్ పోస్టు నుండి) సోనియా: “గత సంవత్సరం వచ్చిన మంచి అనుభవంతో ఇసారి మెరుగైన బడ్జెట్ ఇస్తారని ఆశిస్తున్నా” గత సంవత్సరం బడ్జెట్ లో అనుకున్న లక్ష్యాలు చెరుకోలేదని భారత ప్రభుత్వంపైన అనేకమంది విమర్శలు చేస్తున్నారు. వారిలో స్వదేశీ, విదేశీ పత్రికలు, కార్పొరేట్ కంపెనీలు, పెట్టుబడిదారుల సంఘాలైన ఆసోచామ్, ఫిక్కీ, సి.ఐ.ఐ లూ వీరిలో ముఖ్యులు. గత బడ్జెట్లో బడ్జెట్ లోటు జిడిపిలో 4.6 శాతం ఉంటుందని అంచనా వేసినా దాన్ని చేరుకోలేక 5.9 శాతానికి ప్రభుత్వం…

Railway budget 2012-13

మమత, త్రివేది, రైల్వే బడ్జెట్ -కార్టూన్

రైల్వే మంత్రి దినేష్ త్రివేది తృణమూల్ నేత. ఆయన మమత మాటను జవదాటేవాడేమీ కాదు. భారత దేశంలో రాజకీయ పార్టీలు భూస్వామ్య వ్యవస్ధలకు ప్రతీకలుగా ఉన్నాయే తప్ప ప్రజాస్వామ్య బద్ధగా లేవు. పార్టీ కార్యకర్తల కంటే పార్టీ నాయకులే అక్కడ సుప్రీం. అలాంటి ప్రజాస్వామ్య రహిత పార్టీల్లో తృణమూల్ కూడా ఒకటి. అదీ కాక ఎన్.డి.ఎ ప్రభుత్వంలో మమత రైల్వే మంత్రిగా పని చేసింది. యు.పి.ఎ ప్రభుత్వంలో కూడా మూడేళ్ళు రైల్వే మంత్రిగా పని చేసింది. బెంగాల్…

All options for Greece

అన్నీ టెబుల్ మీదే ఉన్నాయి -కార్టూన్

“అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నాం” ఇది ప్రభుత్వాలకూ, రాజకీయ నాయకులకూ ఊత పదం. దీన్నే ఆంగ్లంలో “ఆల్ ఆప్షన్స్ ఆర్ ఆన్ టేబుల్” అని అంటుంటారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా దగ్గర్నుండి, యూరప్ పాలకుల మీదుగా, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ, ఇండియా ప్రధాని మన్మోహన్ ల వరకూ దీన్ని పదే పదే వాడుతుంటారు. దానర్ధం నిజంగా అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కాదని అనేక సార్లు రుజువయ్యింది. యూరప్ రుణ సంక్షోభం, ఇరాన్ అణు ప్రమాదం, సిరియా కిరాయి తిరుగుబాటు,…

Bomb Iran

ఇరాన్ పై బాంబు పడాల్సిందే -కార్టూన్

ఇరాన్ అణ్వాయుధం తయారు చేసుకుంటుందేమోనన్న భయంతో వణికిపోతున్న ఇజ్రాయెల్ అమెరికా చేత ఇరాన్ యుద్ధం చేయించడానికి కంకణం కట్టుకుని ఉంది. అమెరికాలో అత్యంత శక్తివంతమైన ‘ఇజ్రాయెల్ అనుకూల యూదు లాబీ’ ద్వారా అమెరికా చేత అనేక ఘోరాలు చేయించిన ఇజ్రాయెల్ తాజాగా ఇరాన్ పైన కత్తి కట్టింది. మధ్య ప్రాచ్యం లేదా పశ్చిమాసియాలో ఏకచ్ఛత్రాధిపత్యం వహిస్తూ, పాలస్తీనీయులపై జాత్యహంకార పాలన సాగిస్తూ మూడొందలకు పైగా అణు బాంబులు (బిబిసి ప్రకారం) నిర్మించుకుని ఉన్న ఇజ్రాయెల్ వల్ల ‘ప్రపంచ…