ప్రశ్నించే నోరు మనదే ఐతే… -కార్టూన్

‘వడ్డించే వాడు మనోడే అయితే’ బంతిలో ఎక్కడ కూచున్నా అన్నీ అందుతాయన్నది సామెత. ‘ప్రశ్నించే నోరు మనదే అయితే, నచ్చిన సమాధానం చెప్పుకోవచ్చు’ అన్నది ఇప్పటి సామెత గా చేర్చుకోవచ్చు. కాకపోతే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటూ, ప్రభుత్వాలు చేసే ప్రజా వ్యతిరేక విధానాలపైన తామే నిరసన ప్రదర్శనలు చెయ్యడం ఎమిటి? బందులు హర్తాళ్ లు చేస్తూ ఆవేశకావేశాలు వెళ్లగక్కడం ఏమిటి? ఇక జనానికి సమాధానం చెప్పేదెవ్వరు? యు.పి.ఎ ప్రభుత్వం ఒకేసారి లీటర్ పెట్రో ధర రు. 7.54…

నిండా మునిగిన మన్మోహన్ కి చలే లేదు -కార్టూన్

అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో అప ప్రధ మూట కట్టుకున్న యు.పి.ఎ ప్రభుత్వానికి మరిన్ని ప్రజావ్యతిరేక చర్యలు చేపట్టడానికి సంకోచించడం లేదు. పెట్రోల్ ధరలు లీటర్ కి ఏకంగా రు. 7.54 లు పెంచడం ఆ కోవలోనిదే. ఓ పట్టాన దిగిరాని ద్రవ్యోల్బణంతో ధరలు ఆకాశాన్నంటుతుండగా ప్రజలకు ఉపశమనం చేకూర్చడానికి బదులు మరింత భారాన్ని మోపడానికే మొగ్గు చూపిన కేంద్ర ప్రభుత్వ చర్యను ఎలా అర్ధం చేసుకోవాలి? ఇరాన్ అణు బాంబు విషయంలో పశ్చిమ దేశాలు, ఇరాన్…

‘ఫేస్ బుక్’ ఐ.పి.ఒతో యూజర్ల డేటాకి ప్రమాదం? -కార్టూన్

‘యాక్సిడెంటల్ బిలియనీర్’ మార్క్ జుకర్ బర్గ్ స్ధాపించిన ‘ఫేస్ బుక్’ శుక్రవారం నుండి షేర్ మార్కెట్ లోకి ప్రవేశించిన సంగతి విదితమే. ‘ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్’ (ఐ.పి.ఒ) ద్వారా ‘ఫేస్ బుక్’ సోషల్ నెట్ వర్కింగ్ కంపెనీ షేర్ విలువ 38 డాలర్ల తో ప్రారంభం అయింది. అంటే దాని మార్కెట్ కేపిటలైజేషన్ విలువ దాదాపు 102 బిలియన్ డాలర్లు (ఇప్పటి రూపాయి విలువ ప్రకారం 5.5 లక్షల కోట్ల రూపాయలకు సమానం) అన్నమాట. ఐ.పి.ఒ ప్రకటించడం…

Pranab Austerity

త్వరలో ఇండియాలోనూ ‘పొదుపు విధానాలు’ -కార్టూన్

గురువారం ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ లోక్ సభలో ఓ జోక్ పేల్చాడు. త్వరలో భారత దేశంలోనూ ఆయన ‘పొదుపు విధానాల్ని’ తెస్తాడట. దేశాన్ని ఆర్ధిక సమస్యలు చుట్టుముడుతున్నాయనీ వాటిని ఎదుర్కోవడానికి ‘పొదుపు విధానాలు’ తప్పవనీ ‘బడ్జెట్ ఆమోదం’ ముగిసాక ఆయన లోక్ సభ సభ్యుల్ని ఉద్దేశిస్తూ హెచ్చరిక చేశాడు. ఆయన ఆ ప్రకటన చేసినా, ప్రతిపక్ష సభ్యుల్లో ఎవరూ అదేమని ప్రశ్నించినవారు లేరు. ఆయన ప్రకటనని ఎవరూ గుర్తించినట్లు కూడా కనిపించలేదు. అదేదో తప్పనిసరన్నట్లుగా, మామూలే…

తననూ వదలొద్దని కోరిన నెహ్రూ -కార్టూన్

ప్రజాస్వామిక వ్యవస్ధకు ‘ఫోర్త్ ఎస్టేట్’ గా పత్రికలను అభివర్ణించడం అందరూ ఎరిగిందే. కార్టూన్ ద్వారా రాజకీయ విమర్శలు చేయడం అత్యంత శక్తివంతమైన ప్రక్రియగా పత్రికలు అభివృద్ధి చేశాయి. కాసిన్ని గీతల ద్వారా ప్రకటించే రాజకీయ అభిప్రాయాలని నిషేధించాలని కోరడం అంటే ప్రజాస్వామ్య వ్యవస్ధలో అత్యంత ముఖ్యమైన ‘భావప్రకటనా స్వేచ్ఛ’ కు సంకెళ్లు వేయాలని కోరడమే. అందుకే ప్రజాస్వామ్య ప్రియులైన రాజకీయ నాయకులు తమను తాము విమర్శలకు అతీతులుగా ఎన్నడూ పరిగణించరు. భారత దేశ ప్రధమ ప్రధాని ‘జవహర్…

గొడవకి కారణమైన ‘అంబేద్కర్ కార్టూన్’ ఇదే -కార్టూన్

శుక్రవారం లోక్ సభలో జరిగిన గొడవతో ఎన్.సి.ఇ.ఆర్.టి సెలక్షన్ కౌన్సిల్ సభ్యులూ, ఛీఫ్ సలదారులూ అయిన ఇద్దరు రాజీనామా చేయవలసి వచ్చింది. దళిత ఎం.పిలు గొడవ చేయడంతో ప్రముఖ కార్టూనిస్టు శంకర్ కార్టూన్ ఉన్న పదకొండవ తరగతి రాజకీయ శాస్త్రం లో ఒక పాఠ్యాంశంగా ఉన్న పుస్తకాన్ని తొలగిస్తున్నట్లు మానవ వనరుల శాఖ మంత్రి ‘కపిల్ సీబాల్’ ప్రకటించాడు. ఆయనతో పాటు ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ కూడా కార్టూన్ అలా గీయవలసింది కాదని వ్యాఖ్యానించారు. కార్టూన్…

అంబేడ్కర్ కార్టూన్ పై ఇంత రగడ అవసరమా? -కార్టూన్

శుక్రవారం పార్లమెంటులో అంబేడ్కర్ కార్టూన్ విషయంలో జరిగిన రగడ కు స్పందనగా ‘ది హిందూ’ పత్రిక కార్టూనిస్టు ‘సురేంద్ర’ గీసిన కార్టూన్ ఇది. మమత బెనర్జీ పై గీసిన కార్టూన్ ని ఈమెయిల్ ద్వారా ఇతరులకు పంపాడన్న కారణంతో ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ పైన కేసులు పెట్టి వేధించడాన్ని దేశం మొత్తం ఖండించింది. దేశ రాజకీయ నాయకులతో పాటు, అనేక మంది స్కాలర్లు, విద్యావేత్తలు, రాజకీయ వేత్తలు మెచ్చిన కార్టూనిస్టు ‘శంకర్’ గీసిన కార్టూన్ అరవై అయిదేళ్ల…

అమెరికా నిరుద్యోగం -కార్టూన్లు

పశ్చిమ దేశాల ఆర్ధిక వ్యవస్ధలకు ‘నిరుద్యోగం’ కొత్త సాధారణ లక్షణం (new normal) గా మారిపోయింది. ఆర్ధిక సంక్షోభం అనంతరం ‘రికవరీ’ సాధించినట్లయితే అందులో ‘జాబ్ గ్రోత్’ కూడా కలిసి ఉండడం నియమం. కాని 2008 ఆర్ధిక సంక్షోభం అనంతరం ‘రికవరీ’ సాధించామని చెబుతున్నప్పటికీ అందులో ‘జాబ్ గ్రోత్’ లేదు. దానితో ఆర్ధిక వేత్తలు ఇప్పటి రికవరీని ‘జాబ్ లెస్ రికవరీ’ గా పేర్కొంటున్నారు. ‘జాబ్ గ్రోత్’ లేని రికవరీ, అసలు రికవరీ కానే కాదు. అందుకే…

ఫ్రాన్సు ఎన్నికల్లో సర్కోజి ఓటమి -యూరోప్ కార్టూన్లు

ఫ్రాన్సు అధ్యక్షుడు నికొలస్ సర్కోజి ఓటమి పై యూరోపియన్ కార్టూనిస్టులు ఇలా స్పందించారు. యూరోపియన్ బహుళజాతి కంపెనీలతో పాటు అమెరికా బహుళజాతి కంపెనీలకు లబ్ది చేకూరుస్తూ జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఫ్రాన్సు అధ్యక్షుడు నికొలస్ సర్కోజీల నేతృత్వంలో యూరోపియన్ ప్రభుత్వాలు అమలు చేసిన పొదుపు ఆర్ధిక విధానాలతో యూరోపియన్ ప్రజలు తీవ్రంగా విసిగిపోయారు. కంపెనీలకు బెయిలౌట్లు పంచిపెట్టడం వల్ల పేరుకున్న అప్పులను కోతలు, రద్దులతో ఇ.యు ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయి. కార్మికులు, ఉద్యోగుల వేతనాలలో గణనీయ…

IPL score

ఇండియన్ ప్రెసిడెన్షియల్ లీగ్ -కార్టూన్

ఓ వైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీలు జరుగుతుండగానే భారత దేశ రాష్ట్ర పతికి ఎవరు సరైన అభ్యర్ధులో తేల్చుకోవడానికి రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు పడుతున్నాయి. రెండు చోట్ల, రెండు రంగాల్లో చోటు చేసుకున్న ద్వైదీ భావ ‘టు బి ఆర్ నాట్ టు బి’ పరిస్ధితి ‘ది హిందూ’ పత్రిక కార్టూనిస్టు సురేంద్రను ఈ కార్టూన్ గీయడానికి పురి గొల్పింది. రాష్ట్రపతి పదవికి ఇద్దరు అభ్యర్ధులను కాంగ్రెస్ ప్రతిపాదించింది. వారు ఉప రాష్ట్రపతి హమీద్…

UP' congress debacle

రాహుల్ ప్రసక్తి లేని యు.పి కాంగ్రెస్ ఓటమి సమీక్ష -కార్టూన్

యు.పి లో కాంగ్రెస్ ఓటమిని సమీక్షించడానికి ఎ.కె.ఆంటోని, షీలా దీక్షిత్, సుశీల్ కుమార్ షిండే లతో కాంగ్రెస్ నియమించిన కమిటీ, నివేదికను పూర్తి చేసినట్లు పత్రికలు తెలిపాయి. యు.పి ఎన్నికలకు చాలా ముందు నుండె ప్రచారంలోకి దూకిన రాహుల్ గాంధీ ప్రసక్తి లేకుండానే కమిటీ తన నివేదికను పూర్తి చేసినట్లు అవి తెలిపాయి. సరైన అభ్యర్ధులకి టిక్కెట్లు ఇవ్వకపోవడం, అవినీతిపై ప్రజల దృక్పధం, అధిక ధరలు, వివాదాస్పద ప్రచారం కాంగ్రెస్ ఓటమికి కారణాలని కమిటీ నివేదించిందని తెలుస్తోంది.…

సచిన్ రాజ్య సభ్యత్వం వెనుక కాంగ్రెస్ కుట్ర -కార్టూన్

సచిన్ టెండూల్కర్ కి  రాష్ట్ర పతి కోటాలో రాజ్య సభ సభ్యత్వం కట్టబెట్టడం వెనుక కాంగ్రెస్ కి మోసపూరిత ఉద్దేశ్యాలున్నాయని బాల్ ధాకరే ఆరోపించాడు. బాల్ ధాకరే ఆరోపణలకు ‘ది హిందూ’ కార్టూనిస్టు సురేంద్ర ఇచ్చిన కార్టూన్ రూపం ఇది. కాంగ్రెస్ కి ఏ ఉద్దేశ్యాలున్నాయో ఏమో గాని రాజకీయ చదరంగంలో సచిన్ ఒక పావుగా మారే సూచనలు అప్పుడే కనిపిస్తున్నాయి. మరో పక్క రాజ్య సభ సభ్యత్వం స్వీకరించినంత మాత్రాన తాను రాజకీయాల్లోకి రాబోనని సచిన్…

Sachin, MP

పార్లమెంటుతో సచిన్ సరికొత్త ఇన్నింగ్స్ -కార్టూన్

రాష్ట్ర పతి కోటాలో సచిన్ టెండూల్కర్ రాజ్య సభ సభ్యుడయ్యాడు. సెంచరీల శతకం సాధించినందుకు అభినందనలు అందుకోమని పిలిచి కాంగ్రెస్ సుప్రీం సోనియా ఆయనకి రాజ్య సభ్య సభ్యత్వం కట్టబెట్టింది. సచిన్ కి ‘భారత రత్న’ ఇవ్వాలని ఓ పక్క చర్చలు సాగుతుండగా రాజ్య సభ సభ్యత్వం కట్టబెట్టడం అనుమానాలు రేకెత్తించింది. భారత రత్న ఇవ్వలేక రాజ్య సభ్య సభ్యత్వం ఇచ్చినట్టా లేక భారత రత్న కు రాజ్య సభ సభ్యత్వం బోనస్సా అన్నది ముందు ముందు…

అమెరికా సీక్రెట్ సర్వీస్ స్కాండల్ -మరిన్ని కార్టూన్లు

అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా అంగరక్షకులు తమ బాస్ రక్షణ కోసం కొలంబియా వెళ్లి ఎస్కార్ట్ మహిళలతో దొరికిపోయిన అంశం ఒబామా ఎన్నికల ప్రచారంలో పంటికింద రాయిలో తగులుతోంది. వివిధ వర్గాల ప్రముఖులు, ప్రజలు ఒబామా భద్రతాధికారుల ప్రవర్తన పట్ల విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల సంవత్సరం కావడంతో అధ్యక్షుడు ఒబామాకి ఈ వ్యవహారం ప్రతికూలంగా పని చేస్తుందని కూడా భావిస్తున్నారు. ఒబామా ఎన్నికపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడే తలియదు గానీ రాజకీయ కార్టూనిస్టులు మాత్రం వచ్చిన…

Saving Taxpayers money

ఖజానాపై భారం తగ్గించిన ఒబామా భద్రతాధికారులు! -కార్టూన్

కొలంబియాలో ఒబామా భద్రత కోసం వెళ్ళిన భద్రతా సిబ్బంది పన్నెండు మంది ‘ఎస్కార్ట్’ మహిళలతో ఉండగా దొరికిపోయి విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ‘ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికా స్టేట్స్’ కాన్ఫరెన్స్ కోసం కొలంబియా లోని కార్టిజీనా నగరానికి కొద్ది రోజుల క్రితం ఒబామా వెళ్ళివచ్చాడు. స్ధానిక క్లబ్ లో తాగి అక్కడే మహిళలతో బేరం కుదుర్చుకుని తాము బస చేసిన హోటల్ కి తీసుకెళ్లారు. $800 ఇస్తానని చెప్పి ఉదయాన్నే $30 మాత్రమే ఇవ్వజూపడంతో ఒక మహిళ…