ఐఫోన్ X: తయారీ ఖర్చు $358, అమ్మకం ధర $1570 -విశ్లేషణ
మాకింతోష్ (మ్యాక్) కంప్యూటర్, ఐ పాడ్, ఐ ఫోన్, ఐ ప్యాడ్… ఈ ఎలక్ట్రానిక్ వస్తువులకు ఉన్న గిరాకీ అంతా ఇంతా కాదు. ఎంత గిరాకీ అంటే ప్రపంచంలో అనేక దేశాల జిడిపి విలువల కంటే ఎక్కువగా యాపిల్ కంపెనీ వద్ద డబ్బు పోగుబడేటంత! ఐ ఫోన్ ను సొంతం చేసుకోవడం కోసం రెండేళ్ల క్రితం చైనా యువకుడు ఒకరు తన కిడ్నీని అమ్ముకున్నాడంటే యాపిల్ ఉత్పత్తులకు ఉన్న గిరాకీ ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. భారీ మొత్తంలో…