గత ప్రభుత్వాలూ కృషి చేశాయి -దారి తప్పిన మోడి

అస్సాంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. సర్బానంద సోనోవాల్ నేతృత్వంలో బి‌జే‌పి మొదటి సారిగా అస్సాంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనేకమంది కేబినెట్ మంత్రులతో సహా ప్రధాన మంత్రి నరేంద్ర మోడి కూడా కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంతవరకు ఈ వార్తలో విశేషం ఏమీ లేదు. ప్రధాన మంత్రి ప్రసంగంలో దొర్లిన కొన్ని మాటలే అసలు విశేషం. “స్వతంత్రం అనంతరం గతంలో ఏ ప్రభుత్వం అధికారం లోకి వచ్చినా కూడా, ప్రతి…

కాంగ్రెస్ తిరిగి ఎప్పటికీ లేచేను? -కార్టూన్

నాయకుడు: “లే, లే! మనం పోరాడాలి!” కురువృద్ధ పార్టీ: “నన్ను కూలదోసింది ఎవరూ!? (నువ్వు కాదూ?)” *** మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ ఓటమి సంపూర్ణం అయిందని రాజకీయ విశ్లేషకులు, పత్రికలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక సమీప భవిష్యత్తులో ఆ పార్టీ కోలుకోవడం చాలా కష్టం అని తీర్మానిస్తున్నారు. కానీ పాజిటివ్ ఓటు కంటే నెగిటివ్ ఓటే ఎక్కువ ప్రభావం కలిగించే పరిస్ధితుల మధ్య ఆ పార్టీని కొట్టిపారేయడం తొందరపాటుతనమే కాగలదు. అయితే అందుకు ఒక…

ఒకరిది హైరానా, మరొకరిది ఘరానా -కార్టూన్

ఆటగాళ్ళు ఇద్దరూ క్రీజు వదిలి మధ్యలో నిలబడి మాట్లాడుకుంటున్నారు. కాదు, పోట్లాడుకుంటున్నారు. బంతిని తొందర తొందరగా వికెట్ల దగ్గరికి విసిరేస్తే వికెట్లను పడగొట్టి ఆటగాళ్లను ఔట్ చేయొచ్చని ఫీల్డర్లు, బౌలర్, వికెట్ కీపర్ ల హైరానా! ఒక ఆటగాడే మొత్తం టైమ్ అంతా తినేస్తున్నాడు. మరో ఆట గాడికి బ్యాట్ ఝుళిపించే సమయం దొరికి చావడం లేదు. స్ట్రైకింగ్ ఛాన్స్ వస్తే తన సత్తా చూపించవచ్చని మరో ఆటగాడి ఆత్రం. కానీ తాను నిలదొక్కుకున్నా గనక తన…

కురువృద్ధ కాంగ్రెస్ ను తీరానికి చేర్చేదిలాగేనా! -కార్టూన్

వందకు మించిన పార్లమెంటు సభ్యులకు నాయకత్వం వహించడానికి అలవాటుపడిన నెహ్రూ-గాంధీ కుటుంబం 44 మందికి కుదించుకుపోయిన పార్లమెంటరీ పార్టీకి నాయకత్వం వహించడానికి సిగ్గుపడిందో ఏమో గానీ మొదటిసారి లోక్ సభ నాయకత్వాన్ని కుటుంబేతరుడు మల్లిఖార్జున్ ఖార్గే కు అప్పజెప్పింది. మొత్తం పార్లమెంటు సభ్యుల్లో కనీసం 10 శాతం సీట్లన్నా గెలుచుకోలేక ప్రతిపక్ష హోదా కోసం కూడా పాలక కూటమిని బతిమాలుకునే పరిస్ధితిలో ఉన్న కాంగ్రెస్, తెలివిగా దళితుడిని లోక్ సభ నేతగా ఎన్నుకోవడం ద్వారా ప్రతిపక్ష నాయకత్వాన్ని…

6గురు ఎం.పిల బహిష్కరణ, లోక్ సభకే బిల్లు

ప్రతిపక్ష బి.జె.పి విమర్శలు తమ ద్వంద్వ ఎత్తుగడలను ఉతికి ఆరబెట్టడంతో కాంగ్రెస్ సవరణలకు దిగింది. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఇచ్చిన ఆరుగురు కాంగ్రెస్ ఎం.పిలను పార్టీ నుండి బహిష్కరించింది. తద్వారా తెలంగాణ బిల్లు విషయంలో తాను సీరియస్ గా ఉన్నానని చెప్పే ప్రయత్నం చేసింది. బిల్లును మొదట రాజ్యసభలో పెడతామని చెప్పిన ప్రభుత్వం న్యాయశాఖ సలహాతో రూటు మార్చుకుని లోక్ సభలో పెట్టడానికి నిర్ణయించుకుంది. 6గురు కాంగ్రెస్ ఎం.పి లు అమరవీరులుగా ఛానెళ్ల ముందు నిలబడుతుండగా,…

బీహార్: జె.డి(యు)కు కాంగ్రెస్ మొండి చెయ్యి -కార్టూన్

మతోన్మాదం పేరుతో బి.జె.పి తో సంబంధాలు తెంచుకున్న జనతాదళ్ (యునైటెడ్) పార్టీ రెంటికీ చెడ్డ రేవడిగా మిగిలినట్లు కనిపిస్తోంది. బీహార్ లో లాలూ ప్రసాద్ పార్టీ రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్.జె.డి) మరియు పాశ్వాన్ పార్టీ లోక్ జనతాంత్రిక్ పార్టీ (ఎల్.జె.పి) లతో పొత్తు కట్టడానికి కాంగ్రెస్ దాదాపు నిశ్చయం అయిందని పత్రికలు చెబుతున్నాయి. ఇక ప్రకటన చేయడమే మిగిలిందని తెలుస్తోంది. ఇదే నిజమయితే బీహార్ లో జె.డి(యు) ఒంటరిగా మిగిలిపోతుంది. ఏదో ఒక పార్టీతో పొత్తు…

బి.జె.పి… బోడి మల్లయ్య -కార్టూన్

“ఒడ్డు చేరేదాకా ఓడ మల్లయ్య, ఒడ్డు చేరాక బోడి మల్లయ్య!” ఈ సూత్రాన్ని కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బి.జె.పి పైన ప్రయోగించిందని కార్టూన్ సూచిస్తోంది. కాని, అది నిజమేనా? ఉప్పు-నిప్పుగా ప్రజలకు కనిపించే కాంగ్రెస్, బి.జె.పిలు ఒక్కటై ఆహార భద్రతా బిల్లు, భూ స్వాధీన బిల్లు లను ఆమోదించాయి. బిల్లులు ఆమోదం పొందేవరకు ఇరు పక్షాలు ఒకరినొకరు బాగా సహకరించుకున్నాయి. ఆహార భద్రతా బిల్లులో బి.జె.పి చేసిన కొన్ని సవరణలను ఆమోదించేవరకు కాంగ్రెస్ వెళ్లింది. కొన్ని సవరణలను…

కాంగ్రెస్ ప్రధాని అభ్యర్ధి -కార్టూన్

భారతీయ జనతా పార్టీ తమ ప్రధాని అభ్యర్ధి ఎవరో చేప్పలేదు. తాము ఇంకా నిర్ణయించుకోలేదని బి.జె.పి అధ్యక్షుడు చెబుతున్నప్పటికీ ఇతర నాయకులు మాత్రం నరేంద్ర మోడియే ప్రధాని అభ్యర్ధి అని బహిరంగంగానే చెబుతున్నారు. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు నరేంద్ర మోడి అని చెప్పని నాయకుడు బి.జె.పిలో లేరు. హైద్రాబాద్ లో న.మో సభ పెట్టి దానికి రు. 5/- టికెట్ పెట్టే వరకూ బి.జె.పి నాయకులు వెళ్లారు. అదేమంటే ఉత్తరాఖండ్ వరద బాధితుల సహాయం…

బబూన్ ల గుంపే కాంగ్రెస్ -నిజం

బబూన్ అంటే తెలుగులో కొండముచ్చు అని అర్ధం. గండు కోతి, తిమ్మడు అని కూడా అంటారని అంతర్జాలంలో ఆంగ్ల పదాలకు తెలుగు తదితర భారతీయ భాషలకు అర్ధాలు ఇచ్చే శబ్ద కొష్ ద్వారా తెలుస్తోంది. ఈ గండు కోతులు పెద్ద సంఖ్యలో గుంపులుగా కూడితే దాన్నే కాంగ్రెస్ అంటారట! అమెరికా పార్లమెంటులో దిగువ సభ అయిన ప్రతినిధుల సభ (House of Representatives) ను కూడా కాంగ్రెస్ అంటారు. సభకు ఆ పేరు సరిగ్గా సరిపోయిందని ఈ…

కాంగ్రెస్, బి.జె.పి ల తేడా? -ఇలస్ట్రేషన్

భారత దేశంలో వివిధ రాజకీయ పార్టీల మధ్య తేడా క్రమంగా కనుమరుగవుతున్న సంగతి అంతకంతకూ ప్రస్ఫుటం అవుతోంది. జె.డి(యు) కేంద్రంగా జరిగిన, జరుగుతున్న పరిణామాలు అందుకు ఒక సాక్ష్యం మాత్రమే. కాంగ్రెస్, బి.జె.పిల మధ్య వారు చెప్పుకునే సైద్ధాంతీక విభేదాలే ఉన్నట్లయితే జె.డి(యు) ఆ రెండు పార్టీలకూ ఉమ్మడి మిత్రుడు ఎలా కాగలుగుతుంది? నిన్న, ఈరోజు అన్న ఒక్క తేడాయే తప్ప జె.డి(యు)-బి.జె.పి, జె.డి(యు)-కాంగ్రెస్ సంబంధాల్లో ఉన్నదంతా పోలికే. దేశంలోని పార్లమెంటరీ పార్టీలన్నీ ఒక తానులోని ముక్కలే.…

చైనాలో వెల వెల బోయిన భారత ప్రజాస్వామ్యం, సెక్యులరిజం

ప్రజాస్వామిక హక్కులు లేవనీ, మానవ హక్కులు మంట గలుస్తున్నాయనీ, భావ ప్రకటనా స్వేచ్చకీ ఇనప దడులు కట్టారనీ చైనాను ఆడిపోసుకోవడం కద్దు. భారత దేశంలోని హిందూమత శక్తులు చైనా మానవహక్కుల చరిత్రపై దాడులకు సదా సిద్ధంగా ఉంటాయి. అలాంటి చోటనే భారతీయులు ఏర్పరిచిన కళా ప్రదర్శనలో గుజరాత్ మత మారణకాండ పై ఉంచిన చిన్న వీడియోను తొలగించాలని భారత ప్రభుత్వం స్వయంగా కోరి సఫలమయింది. కాంగ్రెస్ పార్టీ చెప్పుకునే సెక్యులరిజం నేతిబీర లోని నెయ్యి చందమేననీ, రాజకీయ…

నెం.1 స్ధానంలో రాహుల్ గాంధీ ఖర్చీఫ్

వారసత్వ రాజకీయాలకు భారత దేశం పెట్టింది పేరు. సొంత ప్రయోజనాల కన్నా నాయకుల పట్ల సానుభూతికి భారతీయులు ఎక్కువ విలువ కట్టబెట్టడం ఇక్కడ రివాజు. భర్త చనిపోతే భార్యకు, తండ్రి చనిపోతే కొడుకుకి సానుభూతి ఓట్లు కురిపించి పీకలమీదికి తెచ్చుకోవడానికి శ్రామిక జనం పెద్దగా ఫీలవరు. ఇక సానుభూతి రాజకీయాలను వ్యవస్ధాగతం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. నెహ్రూ, ఇందిర, సంజయ్ రాజీవ్ లు, సోనియా… ఇప్పుడు రాహుల్. తెలివిగా రాజకీయ వయసుకు ఎంతో ముందుగానే రంగం…