అరుణాచల్: కాంగ్రెస్ మాస్టర్ స్ట్రోక్! 

అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారం పోగొట్టుకోవటం ఇక లాంఛనప్రాయమే అనుకున్నారు అందరూ. చీలిక వల్ల ఆ పార్టీకి మెజారిటీ లేదు. కాస్త సమయం తీసుకుని చీలిన ఎమ్మెల్యేలను సొంత గూటికి రప్పిద్దాం అన్న లక్ష్యంతో బల నిరూపణకు సమయం కోరితేనేమో గవర్నర్ లేదు పొమ్మన్నారు. ఇంకా ఒక రోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ పరిస్థితుల్లో బలం నిరూపించుకోలేక ముఖ్యమంత్రి నబామ్ టుకి రాజీనామా సమర్పించటమే తరువాయి, అని అంతా భావించారు. “ఆపరేషన్ సక్సెస్,…

సెలవులో రాహుల్ -ది హిందు ఎడిటోరియల్

[Rahul on Leave శీర్షికన నిన్న ది హిందులో ప్రచురితం అయిన ఎదిరోరియల్ కు యధాతధ అనువాదం. -విశేఖర్] రాహుల్ గాంధీ ఆత్మ శోధనకు ఎంచుకున్న ప్రస్తుత కాలం కంటే మించిన గడ్డు కాలం మరొకటి ఉండబోదు. పార్లమెంటరీ బడ్జెట్ సమావేశాలకు సరిగ్గా ముందు ఆయన ఆ పనికి పూనుకున్నారు. ఇటీవలి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎదుర్కొన్న అవమానకర ఓటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్) ప్రభుత్వం…

రాహుల్ యుద్ధం: ఉత్త కుమారుడేనా? -కార్టూన్

కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ కనీసం ఉత్తర కుమారుడు కూడా కాదనీ, ఆయన సోనియా గాంధీకి ‘ఉత్త కుమారుడే’ అనీ ఆయనగారి ధోరణి చెబుతోందని కార్టూన్ సూచిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి తామిద్దరమే బాధ్యులమని తల్లిగారితో పాటు గంభీరంగా ప్రకటించిన రాహుల్ గాంధీ ప్రతిపక్ష హోదాలో ప్రజల కోసం ప్రభుత్వంతో యుద్ధం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ తీరా పార్లమెంటరీ సమావేశాలు మొదలయ్యాక ఆయన పత్తా లేకుండా పోయారు. ఎక్కడో చివరి వరుసలో కూర్చుని…

ఎన్నికల మేనిఫెస్టో: ఒక పనికిరాని డాక్యుమెంట్

మేనిఫెస్టో: గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ పరిపూర్తి చేస్తాం. జనం: ఇదిగో ఈ ఒక్క పేజీని మీ మేనిఫెస్టో చెయ్యండి చాలు! *** రాజకీయ పార్టీలు ప్రస్తుతం మేనిఫెస్టోల జాతరలో మునిగి తేలుతున్నాయి. పదేళ్ళు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ మళ్ళీ అవే వాగ్దానాలతో మేనిఫెస్టో విడుదల చేయగా బి.జె.పి దాన్ని అబద్ధాలు, మోసపూరితం అంటూ కొట్టిపారేస్తోంది. అక్కడికి బి.జె.పి మేనిఫెస్టో పక్కా నిజాయితీతో తయారు చేసినట్టు! ది హిందు పత్రిక ప్రకారం కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో…

పోటీకి అభ్యర్ధులు లేని కాంగ్రెస్! -కార్టూన్

: అదిగదిగో, ఒక సీనియర్ నాయకుడు… పోటీ చేయడానికి సిద్ధమై వస్తున్నారు! : నో, ధాంక్ యూ! *** రాయల సీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్ధులు దొరకడం లేదని ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం వాడుకలో ఉన్న జోక్! కానీ దేశవ్యాపితంగా కూడా కాంగ్రెస్ ది అదే పరిస్ధితని ఈ కార్టూన్ సూచిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ తరపున పోటీ చేసే సీనియర్ నాయకులు లేరని కార్టూన్ చెబుతోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని…