ఉక్రెయిన్: రష్యా వైపా, ఇ.యు వైపా?

యూరోపియన్ యూనియన్ లో చేరడాన్ని ఉక్రెయిన్ వాయిదా వేయడంతో ఇప్పుడక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రజలు పెద్ద ఎత్తున రాజధానికి తరలి వచ్చి ఇ.యు లో చేరాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఇ.యులో చేరడాన్ని నిరాకరిస్తున్న అధ్యక్షుడు, ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమ దేశాలకు అనుకూలంగా వ్యవహరించే మూడు ప్రతిపక్ష పార్టీల నేతృత్వంలో ఈ ఆందోళనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అల్లర్లకు పాల్పడినవారిని పోలీసులు అరెస్టు చేయగానే అమెరికా, ఐరోపాల ప్రభుత్వాలు, పత్రికలు ‘మానవ హక్కులు’ అంటూ కాకి…

రష్యాకు మరో దౌత్య విజయం, ఇ.యుకు ఉక్రెయిన్ నో

పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని గేలి చేస్తూ రష్యా మరో దౌత్య విజయం నమోదు చేసింది. ‘మాస్టర్ స్ట్రోక్’ లాంటి ‘సిరియా రసాయన ఆయుధాల వినాశనం’ ద్వారా మధ్య ప్రాచ్యం రాజకీయాల్లో అమెరికాను చావు దెబ్బ తీసిన రష్యా ఇప్పుడు ఉక్రెయిన్ విషయంలో మరో పంజా విసిరింది. తాజా పంజా దెబ్బ ఫలితంగా యూరోపియన్ యూనియన్ తో వాణిజ్య సాపత్యం కోసం జరుపుతున్న చర్చలను సస్పెండ్ చేస్తూ ఉక్రెయిన్ ప్రధాని డిక్రీపై సంతకం చేశారు. ఉక్రెయిన్ చర్యతో వివిధ…