స్నేహితా…! –కవిత

(ఈ కవిత 2001లో రాసింది. అంతకుముందు సంవత్సరం నా పుట్టిన రోజు నాడు మా డివిజనల్ మేనేజర్ పంపిన గ్రీటింగ్ కార్డ్ కు ‘ప్రణమీయ హితైషి’ కవితతో బదులిచ్చానని చెప్పా కదా. అది చూసి మా కొలీగ్ ఒకరికి తనకు కూడా నా చేత కవిత రాయించుకోవాలని తోచింది. కానీ నాకు స్ఫూర్తి తెప్పించడం ఎలా? అందుకు తానొక పధకం వేసుకున్నారు. సంవత్సర కాలం పాటు ఓపిక పట్టారు. తర్వాత యేడు పుట్టిన రోజుకి నేను నిద్ర…

ప్రణమీయ హితైషికి… -కవిత

(ఈ కవిత 2000 సం.లో రాసినది. నా పుట్టిన రోజు సందర్భంగా అప్పటి మా సీనియర్ డివిజనల్ మేనేజర్ గోపీనాధ్ గారు అభినందనలు తెలియజేస్తూ ఒక గ్రీటింగ్ పంపారు. ఆయన గ్రీటింగ్ కు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈ కవిత రాసి పంపాను. ఆయన గొప్ప వక్త. ముఖ్యంగా ద్రవ్య కంపెనీల వ్యాపారాభివృద్ధి కోసం ఫీల్డ్ స్టాఫ్ ను ఉత్తేజపరిచే ఉపన్యాసాలు ఇవ్వడంలో దిట్ట. ఆ తర్వాత వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకుని పూర్తికాలం ఉత్తేజ ప్రసంగాలు…

నేను ఏకాకిని… -కవిత

నేను ఏకాకిని జనారణ్యంలో మనుషుల్ని వెతుక్కుంతున్న జీవాన్ని మనుషుల్లో ‘మనసు’ కై దేవులాడుతున్న మానవతా పిపాసిని నటిస్తున్న నిద్రపై స్వారీ చేస్తున్న మెలకువని చచ్చిన రాకుమారుడ్ని మళ్ళీ చంపి వధ్య శిల ఎక్కనున్న చంద్రమతిని కృత్రిమత్వానికి సహజత్వానికి మధ్య దూరాన్ని కొలుస్తున్న కొలబద్దను సమూహంలో లేని సామూహికతను సమాజంలో లేని సామాజికతను కృష్ణుడిని తప్ప చూడలేని దృత రాష్ట్రుడి చూపుని కళ్ళకు గంతలు కట్టని గాంధారిని కుప్పతొట్టి బాలల కడుపు నింపుతున్న నిండు విస్తరాకుని పాలింకిన చన్నులను…

దుః ఖైర్లాంజి -ఎండ్లూరి సుధాకర్ కవిత

(దిన, వార పత్రికలు చదివే వారికి డాక్టర్ ఎండ్లూరి సుధాకర్ పేరు చిరపరిచతమే. ఆయన రాసిన ఈ కవిత వెబ్ మహిళా సాహిత్య పత్రిక ‘విహంగ‘ లో ఫిబ్రవరి 1 తేదీన ప్రచురించబడింది. పత్రిక సంపాదకుల అనుమతితో ఇక్కడ పునర్ముద్రిస్తున్నాను. -విశేఖర్) ఆ రాత్రి ఆకాశం నెత్తుటి వెన్నెల కురిసింది ఆ రాత్రి మట్టి మాంసం ముద్దగా మారింది ఆ రాత్రి నిలువెత్తు నీలి విగ్రహం నీరై పోయింది ఆ రాత్రి ఆత్మ గౌరవం ఆయుధంకాలేక విలపించింది…

కూతురు ప్రశ్న–హృద్యమైన కవిత

కూతురు ప్రశ్న -రచన: నాగరాజు ఒక దృశ్యానికేసి చూపుతూ మర్మాంగమంటే ఏమిటని ఏడేళ్ళ కూతురు అడిగిన ప్రశ్నకు దూరంగా ఉదయం నుండి తిరుగుతున్నాను ఒక్కో పూవునూ ఏరి కూర్చి కథా మాలికలను దిగంతాలకు పరిచినట్టో ఒక దృగ్విషయపు లోతులకు దూకి పొరలను తొలుచుకొని కాంతియానం చేసినట్టో కాదు కదా అదే పనిగా ఎవరూ చెప్పకపోయినా సరిగా కూర్చోవాలనీ దాచ్చుకున్నట్టుగా తిరగాలనీ తన చుట్టూ ఉన్న వారిలోనే తప్పుక తప్పుక తిరుగుతూ జీవన క్రియలనూ జీవితాన్నీ సాగించాలనీ నేర్చుకుంటున్న…