కర్ణాటక: క్రైస్తవ పుస్తకాలు తగలబెట్టిన హిందుత్వ గ్రూపులు

ఇప్పుడిక క్రైస్తవుల వంతు వచ్చింది. దేశంలో ఓ పక్క ముస్లింలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కర్ణాటకలో ఏడాది నుండి క్రైస్తవుల పైనా చర్చిల పైనా వరుస దాడులు జరుగుతున్నాయి. తాజాగా కోలార్ జిల్లాలో శ్రీనివాస్ పురా లో హిందుత్వ కి చెందిన రైట్ వింగ్ గ్రూప్ కార్యకర్తలు నలుగురు క్రైస్తవ యువకుల పైన దాడి చేశారని ఇండియన్ ఎక్స్^ప్రెస్, NDTV తెలిపాయి. ఈ నలుగురు క్రైస్తవ మత పుస్తకాలను ఇల్లిల్లూ తిరిగి పంచుతున్నట్లు తెలుస్తోంది. హిందూత్వ సంస్థల…

కర్ణాటకలో పదవుల కొట్లాట -కార్టూన్

– నా తక్షణ కర్తవ్యం, మంత్రులు కానివారిని అదుపులో పెట్టడం… – మెట్టు తర్వాత మెట్టు ఎక్కడం రాజకీయ నాయకుల వంతయితే, పెనం మీద నుండి పొయ్యిలోకి నిరంతరాయంగా జారుతుండడం ప్రజల వంతు. తమ మధ్య వైరుధ్యాల పరిష్కారం కోసం ఎన్నికల రూపంలో ప్రజల వద్దకు వచ్చే రాజకీయ నాయకులు, పార్టీలు, ఆ కాస్త ఎన్నికల యజ్ఞం అయ్యాక పదవుల పండేరంలో మునిగి తేలడం రివాజు. కర్ణాటకలో ఇపుడు జరుగుతోంది అదే. అక్రమ మైనింగ్ కేసులు నడుస్తున్నందుకు…

బి.జె.పి కుమ్ములాటలే కాంగ్రెస్ గెలుపు కిరీటం -కార్టూన్

కర్ణాటకలో బి.జె.పి సెల్ఫ్ గోల్ సంపూర్ణం అయింది. జాతీయ స్ధాయిలో కాంగ్రెస్ అవినీతిని ఎండగడుతున్నట్లు ఫోజు పెడుతున్న బి.జె.పి పార్టీకి కర్ణాటకలో సొంత నాయకుల అవినీతిని నెత్తిన పెట్టుకోలేకపోయింది. జాతీయ స్ధాయిలో పరువు ప్రతిష్టలు నిలుపుకోవాలంటే కార్ణాటకలో అవినీతి నాయకుడు యెడ్యూరప్పను దూరం పెట్టక తప్పని పరిస్ధితి. ఫలితంగా బి.జె.పి ఓటు బ్యాంకు చీలిపోవడంతో ఎన్నికలకు ముందే కాంగ్రెస్ గెలుపు ఖాయమైపోయింది. సొంత కుంపటి పెట్టుకుని తగిన సీట్లు తెచ్కుకుని ప్రభుత్వాల్ని శాసించవచ్చు అనుకున్న కర్ణాటక జనతా…