కర్ణాటక వద్ద అరిగిపోయిన బి.జె.పి రికార్డు -కార్టూన్

బి.జె.పి కర్ణాటక ‘నాటకం’ ముగిసేటట్లు కనిపించడం లేదు. యెడ్యూరప్ప ఒత్తిడితో ముఖ్యమంత్రి పీఠం నుండి ‘సదానంద గౌడ’ ను తొలగించిన బి.జె.పి అధిష్టానం ఇప్పుడు సదానంద గౌడ నుండి తాజా డిమాండ్లు ఎదుర్కొంటోంది. శాసన సభా పక్ష సమావేశం ఏర్పాటు చేయవలసిన సదానంద ఆ పని వదిలేసి అధిష్టానం ముందు సొంత డిమాండ్లు ఉంచాడు. సదానందకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి, ఆయన శిబిరంలోని ఈశ్వరప్పకు ఉప ముఖ్యమంత్రి పదవి, ఇంకా మంత్రివర్గంలో సగం పదవులు కావాలని…

కర్ణాటకలో తెగిపడిన మరో తల -కార్టూన్

తమది భిన్నమైన పార్టీ (party with a difference) గా బి.జె.పి చెప్పుకుంటుంది. ఆచరణలో మాత్రం అంతేలేని విభేదాల పార్టీగా (party with unending differences) అనేకసార్లు రుజువు చేసుకుంది. బి.ఎస్.యెడ్యూరప్ప ఆశీస్సులతో సదానంద గౌడ కర్ణాటక ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన పదకొండు నెలలకే అదే యెడ్యూరప్ప ఆగ్రహానికి గురై పదవి కోల్పోవడం అందుకు నిదర్శనం. సదానంద గౌడ పదవీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని 45 మంది ఎం.ఎల్.ఎ లతో సహా ఎగ్గొట్టిన జగదీష్ షెట్టర్,  యెడ్యూరప్ప అనుగ్రహం…

కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా యెడ్యూరప్ప మద్దతుదారు “సదానంద గౌడ” ఎన్నిక

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప మొత్తం మీద తన పంతం కొంతమేరకు నెగ్గించుకున్నాడు. నూతన ముఖ్యమంత్రిగా, యెడ్యూరప్ప వర్గీయుడైన “సదానంద గౌడ” ఎన్నికయ్యాడు. కర్ణాటక లెజిస్లేచర్ పార్టీ నూతన నాయకుడిని ఎన్నుకోవడానికి బుధవారం సమావేశమైంది. ముఖ్యమంత్రి పదవి కోసం యెడ్యూరప్ప, బి.జె.పి అధిష్టానంలు చెరొక అభ్యర్ధిని నిలబెట్టినట్లుగా వార్తా ఛానెళ్ళు చెప్పాయి. రహస్య ఓటిం కూడా జరిగిందని అవి తెలిపాయి. చివరికి సదానంద గౌడను నూతన ముఖ్యమంత్రిగా బి.జె.పి శాసన సభా పక్షం ఎన్నుకుందని ప్రకటన వెలువడింది.…