బూతు మంత్రులే కాదు, డజను పైన బూతు ఎం.ఎల్.ఏ లు కూడా

కర్ణాటక అసెంబ్లీలో ప్రజా సమస్యలను చర్చించడం మాని, ముగ్గురు మంత్రులు బూతు వీడియోలు చూసి టెలివిజన్ కెమెరాలకు దొరికిపోయిన సంగతి తెలిసిందే. అయితే ముగ్గురు మంత్రులే కాకుండా ఇంకా డజను కంటే ఎక్కువ మంది ఎమ్మేల్యేలు కూడా ఆ రోజు బూతు వీడియోలు చూసి తరించినట్లు అసెంబ్లీ కమిటీ పరిశోధనలో బైట పడినట్లు తెలుస్తోంది. మంత్రులు సవాది లక్ష్మణ్, సి.సి.పాటిల్, కృష్ణ పాలేమార్ లు ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీలో మొబైల్ ఫోన్లో బూతు వీడియోలు చూస్తూ…

Porn-ministers

‘నీలి వీడియో’ మంత్రుల రాజీనామా

సాక్ష్యాత్తూ అసెంబ్లీలోనే మొబైల్ ఫోన్ లో ‘నీలి వీడియో’ లు చూస్తూ పట్టుబడిన ముగ్గురు కర్ణాటక మంత్రులు రాజీనామా చేసారు. తాము ‘స్వచ్ఛంధంగానే’ రాజీనామా చేసామని సదరు మంత్రులు పత్రికలకు తెలిపారు. మంత్రులు స్వచ్ఛంధంగానే రాజీనామా చేశారని కర్ణాటక ముఖ్యమంత్రి సదానంద గౌడ కూడా తెలిపాడు. రాజీనామా చేసిన మంత్రులు, ముఖ్యమంత్రి ఏమి చెబుతున్నప్పటికీ రాజీనామా చేయడానికి మంత్రులు నిరాకరించినట్లుగా పత్రికలు బుధవారం వార్తలు ప్రచురించాయి. బి.జె.పి సారధి నితిన్ గడ్కారీ ఎట్టి పరిస్ధితుల్లోనూ మంత్రులు రాజీనామా…