కావేరి ఎన్నికల యజ్ఞం: బీజేపీ పిల్లి మొగ్గలు!

  కావేరి జలాల పంపిణి వివాదం చుట్టూ  ప్రస్తుత కర్ణాటక రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. పార్టీలు సహేతుకతను కావేరి నీళ్లలో కలిపేసాయి. వీలయినంత గరిష్టంగా రాజకీయ లబ్ది పొందేందుకు ఎత్తులు పై ఎత్తులు రచించి అమలు చేయడంలో నిమగ్నం అయ్యాయి. ఈ ఎత్తులు పై ఎత్తుల ఆటలో తనకు ఏది లాభమో అర్ధం కాక బీజేపీ పిల్లి మొగ్గలు వేస్తూన్నది  కావేరి జలాల సంక్షోభంలో తాము కర్ణాటక ప్రయోజనాలకు ఇతర పార్టీల కంటే అధికంగా కట్టుబడి ఉన్నామని చాటుకోవటానికి…

కర్ణాటక: కష్టం ఒకరిది, పేరు మరొకరిది -కార్టూన్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ బావుటా ఎగరవేయడానికి కారణం ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలియడానికి పెద్దగా రాజకీయ పరిజ్ఞానం అవసరం లేదు. దక్షిణ భారతంలో మొట్టమొదటిసారి బి.జె.పి పార్టీ ఖాతాలో ఒక రాష్ట్ర అసెంబ్లీని చేర్చిన ఘనతను సొంతం చేసుకున్న యెడ్యూరప్ప ఈసారి కూడా గెలుపును, ఓటమిని కూడా ప్రభావితం చేశాడని ప్రతి ఒక్కరికీ తెలిసిన నిజం. ‘కర్ణాటక జనతా పక్ష’ పేరుతో యెడ్యూరప్ప ప్రత్యేక పార్టీయే పెట్టకపోయినట్లయితే కాంగ్రెస్ పార్టీ బహుశా సీట్ల…

కర్ణాటక ఎన్నికలు: బి.జె.పి విచిత్ర పోరాటం

మాకు ప్రధాన ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీయేనని కర్ణాటక బి.జె.పి ప్రకటిస్తోంది. తమ నుండి చీలి ‘కర్ణాటక జనతా పార్టీ’ పేరుతో వేరు కుంపటి పెట్టిన యెడ్యూరప్ప ప్రభావాన్ని ఆ విధంగా తక్కువ చేసి చూపాలని బి.జె.పి ప్రయత్నం. బి.జె.పి పాలనలో నిజమైన ప్రతిపక్ష పాత్ర పోషించిన పార్టీ జనతాదళ్ (సెక్యులర్) అని కనుక తామే బి.జె.పి కి ప్రధాన పోటీ అని జె.డి(ఎస్) ప్రకటిస్తోంది. ఆ పార్టీకి ప్రత్యేకంగా పోరాటం చేయాల్సిన పని లేదని దాని ఓటు…