కరెన్సీ కన్వర్టిబిలిటీ గురించి… -ఈనాడు

1991లో పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్ ల నేతృత్వంలోని భారత ప్రభుత్వం నూతన ఆర్ధిక విధానాలను ప్రవేశపెట్టిన దరిమిలా ‘కరెన్సీ కన్వర్టిబిలిటీ’ అనే పదబంధం ఇక్కడ వాడుకలోకి వచ్చింది. అంతకు ముందూ ఉన్నప్పటికీ ఆర్ధికవేత్తల చర్చల వరకే పరిమితమై ఉండేది. ఇప్పుడు అందరికీ తెలుసని కాదు గానీ, అప్పటికంటే ఇప్పుడు ఈ పదబంధ వినియోగం పెరిగింది. ప్రభుత్వ విధానాలలో ఒక అంశంగానూ, విధానంగానూ మారడంతో పత్రికలు సైతం చర్చించడం ప్రారంభించాయి. ప్రాంతీయ భాషా పత్రికలు కూడా ఒకటీ అరా…