మోడి క్లీన్ చిట్: మనస్సాక్షి ఉన్న జడ్జి ఈ సాక్షాన్ని విస్మరించరు!-2

పిటిషనర్ జకీయా జాఫ్రీ తరపున సుప్రీం కోర్టు అడ్వకేట్ కపిల్ సిబాల్ వినిపిస్తున్న వాదనలు: జైదీప్ పటేల్ మొబైల్ అసలు స్వాధీనమే చేసుకోలేదు. ఆయన అనేక ఫోన్ కాల్స్ చేసి ఉంటాడు. ఆయన ఫోన్ స్వాధీనం చేసుకోకపోతే మీరు (సిట్) ఏమి పరిశోధన చేసినట్లు? 27 ఫిబ్రవరి, 2021 (గోధ్రా రైలు దహనం జరిగిన రోజు) తేదీకి ముందే బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, సంఘ్ పరివార్ సభ్యులు ఆయుధాలు, మందుగుండు నిలవ చేసుకున్నారని చెప్పే…

2జి వేలంలో 60 వేల కోట్ల ఆదాయం

ప్రధాని మన్మోహన్ సింగ్, ఐ.టి మంత్రి కపిల్ సిబాల్, ఆర్ధిక మంత్రి చిదంబరం, మాజీ ఐ.టి మంత్రి ఎ.రాజా తదితరులు వినిపించిన ‘జీరో లాస్’ (Zero loss) వాదన ఒట్టిపోయింది. సుప్రీం కోర్టు రద్దు చేసిన 122 2జి లైసెన్స్ లలో కొంత భాగానికి వేలం జరిపిన కేంద్రం 60,000 కోట్ల రూపాయలకు పైగా సంపాదించింది. వాయిదాల పద్ధతిలో చెల్లించడానికి కంపెనీలు నిర్ణయిస్తే కేంద్ర ప్రభుత్వం చేతికి తక్షణం రు. 18,273 కోట్లు ముడతాయి. స్పెక్ట్రమ్ రిజర్వ్…

రిలయన్స్ కంపెనీకి నేను మేలు చేయలేదు -కపిల్ సిబాల్ తొండాట

తనపై సుప్రీం కోర్టులో ఒక ఎన్.జి.ఒ సంస్ధ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేసిన మరుసటి రోజు కేంద్ర టెలికం మంత్రి కపిల్ సిబాల్ స్పందించాడు. పత్రికా సమావేశం నిర్వహించి ఇచ్చిన వివరణలో కపిల్ సిబాల్ “ఆకుకూ అందక, పోకకూ పొందక” అన్నట్లు సమాధానాలిచ్చి తొండాట ఆడటానికి ప్రయత్నించాడు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీ వినియోగదారులకు చెప్పకుండా నిర్ధిష్ట సేవలను ఆపేసినందుకుగాను డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అధికారులు ఆ కంపెనీపై సర్కిల్ కి రు.50 కోట్ల చొప్పున మొత్తం…

2జి కుంభకోణం: మంత్రివర్గంలో రాలిపడే తదుపరి తల కపిల్ సిబాల్?

2జి స్పెక్ట్రం కుంభకోణం ఫలితంగా కేంద్ర మంత్రివర్గం నుండి దొర్లిపడే తదుపరి తల విద్యా, టెలికం శాఖల మంత్రి కపిల్ సిబాల్‌ది కావచ్చనడానికి తగిన పరిణామాలు ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. మాజీ టెలికం మంత్రి, డి.ఎం.కె పార్టీ నాయకుడు ఎ.రాజా, సి.బి.ఐ దర్యాప్తు ఫలితంగా జైలు పాలు కావడంతో ఆయన స్ధానంలో కపిల్ సిబాల్ టెలికం శాఖ బాధ్యతలు చేపట్టాడు. ఆయన వచ్చీ రావడంతోనే 2జి స్పెక్ట్రం కేటాయింపుల్లో కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (సి.ఎ.జి) నివేదించినట్లు, కేంద్ర ప్రభుత్వం…