JNU లోపల కన్హయ్యపై దాడి!

ప్రభుత్వాలే ఉద్దేశపూర్వకంగా ఉన్మాదపూరిత భావోద్వేగాలతో దేశంలో గాలిని నింపేశాక కన్హయ్య, ఉమర్ ఖలీద్, అనిర్బన్ లాంటి వాళ్ళకు రక్షణ ఎక్కడ ఉంటుంది? దేశ రాజధానిలో కోర్టు ఆవరణలోనే న్యాయాన్ని రక్షిస్తామని పట్టా పుచ్చుకున్న న్యాయవాదులు పోలీసుల సాక్షంగా కన్హయ్యపై దాడి చేశారు. ఇప్పుడు జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రాంగణంలో తన వారి మధ్య భద్రంగా ఉన్నాడనుకున్న కన్హయ్యను దుండగుడు ఒకరు బూతులు తిట్టి, కొట్టారని వార్త వెలువడింది. పి‌టి‌ఐ వార్తా సంస్ధ ప్రకారం JNUSU అధ్యక్షుడు…

కన్హయ్యతో మమతను పెళ్లగించగలరా? -కార్టూన్

“కన్హైయా కుమార్ ఎన్నికల ప్రచారంలో సి‌పి‌ఐ, సి‌పి‌ఎం పార్టీల తరపున పాల్గొంటారు” అని ఇరు పార్టీలు పుత్రోత్సాహంతో ప్రకటించేశాయి. తద్వారా జే‌ఎన్‌యూ విద్యార్ధుల పోరాటాన్ని తీసుకెళ్లి పార్లమెంటు/అసెంబ్లీ ఎన్నికల రొంపిలోకి దింపి స్వప్రయోజనాలకు వినియోగించడానికి ఆ పార్టీలు తలపెట్టాయి. సి‌పి‌ఎం నేత సీతారాం యేచూరి, సి‌పి‌ఐ నేత డి రాజాలు ఇద్దరూ ఈ మేరకు టి‌వి ఛానెళ్లలో కనపడి ప్రకటన చేశారు. కన్హైయా బెయిల్ పై విధించబడ్డ షరతుల రీత్యా ఆయన కేరళ, బెంగాల్ కు ప్రయాణించబోరని…

పోలీసుల ముందే కొట్టారు -కన్హైయా

ఎవరు నిజం చెబుతున్నారో, ఎవరు అబద్ధం చెబుతున్నారో తెలియని పరిస్ధితుల్లో వీడియోలు చూస్తే తప్ప నమ్మలేని పరిస్ధితి దాపురించింది. శాస్త్ర పరిజ్ఞానం మనిషి జీవితాన్ని సుఖమయం చేయడం ఏమో గానీ కుట్రదారులకు మాత్రం అది బాగా ఉపకరిస్తోంది. నేరుగా వాదించి నెగ్గలేని హిందూత్వ సంస్ధలు వీడియో మార్ఫింగ్ లకు దిగడంతో చివరికి వీడియోలను సైతం పట్టి పట్టి చూడవలసి వస్తోంది. కన్హైయా కుమార్ ని ఎవరూ కొట్టలేదని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బి ఎస్ బస్సీ ఆర్భాటంగా…

జే‌ఎన్‌యూ విద్యార్ధుల పోరాటం: సమగ్రంగా -2

మొదటి భాగం తరువాత…… ఫిబ్రవరి 17 తేదీన సుప్రీం కోర్టు ఆదేశాలు ఏవీ అమలు జరగలేదు. అదే లాయర్లు మళ్ళీ దాడికి దిగారు. రాళ్లు రువ్వారు. కన్హైయా చుట్టూ డజన్ల మంది పోలీసులు వలయంగా ఏర్పడి లోపలికి తీసుకెళ్లినా లాయర్లు దాడి చేసి కొట్టారు. కోర్టు లోపలికి వెళ్ళాక కూడా మెజిస్ట్రేటు ముందే కన్హైయాను ఓ లాయర్ కొట్టాడు. పక్కనే పోలీసులు ఉన్నా నిరోధించలేదు. ఆ లాయర్ బైటికి వచ్చి ‘మా పని చేసేశాం’ అని విలేఖరుల…

సమగ్రంగా: హిందూత్వపై జే‌ఎన్‌యూ పోరాటం -1

(జే‌ఎన్‌యూ విద్యార్ధుల తిరుగుబాటుపై ఇటీవలి రోజుల్లో జరిగిన పరిణామాలను జోడిస్తూ చేసిన సమగ్ర విశ్లేషణ ఇది. సాధ్యమైనంత సమగ్రంగా రాసేందుకు ప్రయత్నించాను. అందువల్ల పెద్ద ఆర్టికల్ అయింది. ఇందులో గత ఆర్టికల్స్ లోని కొన్ని అంశాలను కూడా జోడించాను. అందువలన ఇంతకు ముందు చదివిన భావన కొన్ని చోట్ల కలగవచ్చు. -విశేఖర్) ********* యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో రోహిత్ ఆత్మహత్య, తదనంతర విద్యార్థి ఉద్యమం తెరిపిడి పడక ముందే హిందూత్వ పాలకులు జవహర్ లాల్ నెహ్రూ…

కన్హైయా వీడియో ఎలా ఫేక్? -వీడియో

కన్హైయా కుమార్, ఉమర్ ఖలీద్, రామ నామ, అశుతోష్ మరో ఇద్దరు జే‌ఎన్‌యూ విద్యార్ధులు ఫిబ్రవరి 9 తేదీ కార్యక్రమంలో దేశ వ్యతిరేక నినాదాలు చేశారని కేంద్ర హోమ్ మంత్రి, బి‌జే‌పి అధ్యక్షుడు, ఇతర కేంద్ర మంత్రులు, బి‌జే‌పి నేతలు, ఎం‌పిలు, ఎం‌ఎల్‌ఏలు ఏకబిగిన ఆరోపిస్తున్నారు. ఢిల్లీ పోలీసుల్ని పురమాయించి దేశద్రోహం కేసు కూడా విద్యార్ధులపై బనాయించారు. కన్హైయాను అరెస్ట్ చేశారు. ఆయన్ని కోర్టులో హాజరు పరుస్తుంటే హిందూత్వ లాయర్ గూండాలు ఆయన్ని కొట్టారు. కోర్టుకు వచ్చిన…

ఇంత పతనం ఎందుకు జీ న్యూస్‌? -జీ విలేఖరి రాజీనామా

[జీ న్యూస్ విలేఖరి విశ్వ దీపక్ చానెల్ కు రాజీనామా చేస్తూ చానెల్ యాజమాన్యానికి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖనే ఆయన రాజీనామా లేఖగా వెలువరించారు. లేఖ ఆంగ్ల అనువాదాన్ని ఫస్ట్ పోస్ట్ పత్రిక ప్రచురించింది. ఇతర పత్రికలు కూడా ప్రచురించి ఉండవచ్చు. విశ్వ దీపక్ రాజీనామా లేఖ అనువాదమే ఈ టపా. ఈ అనువాదాన్ని బ్లాగ్ పాఠకుడు సందీప్ ఎస్‌పి గారు వ్యాఖ్య ద్వారా అందించారు. నవ తెలంగాణ పత్రికలో మొదట అచ్చయిన ఈ…

కన్హైయాపై సాక్షాలు లేవుట!

“JNUSU అధ్యక్షుడు కన్హైయా కుమార్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే మేము వ్యతిరేకించం” అంటూ నిన్న ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎంతో ఔదార్యంతో ప్రకటించారు. ఎందుకని అడిగితే “వెల్ ఒక యువకుడి జీవితం” అని జవాబిచ్చారాయన. విద్యార్ధులను అరెస్టు చేసి కేసు పెట్టడంలోనూ, విలేఖరులను, విద్యార్ధులనూ చావబాదుతున్న వీడియోలు ఉన్నా హిందూత్వ గూండాలను వెనకేసుకు రావడంలోనూ ఎంతో ఉత్సాహం ప్రదర్శించిన ఢిల్లీ పోలీస్ కమిషనర్ కి హఠాత్తుగా కన్హైయా యువ విద్యార్ధి అన్న సంగతి ఎందుకు గుర్తుకు…

పాటియాలా హౌస్ కోర్ట్: సంఘటనల క్రమం

ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టులో ఈ రోజు కన్హైయా కుమార్ ని పోలీసులు హాజరు పరచవలసి ఉంది. వాస్తవానికి నిన్ననే విచారణ జరగవలసి ఉండగా హిందూత్వ లాయర్ల వీరంగం వల్ల అది సాధ్యపడలేదు. ఈ రోజుకు వాయిదా వేశారు. ఈ రోజు కోర్టు సజావుగా నడవడానికి సుప్రీం కోర్టు నిర్దిష్ట ఆదేశాలు ఇచ్చింది. ఐదుగురు విలేఖరులు, ఇద్దరు కన్హైయా మద్దతుదారులు మాత్రమే హాజరు కావాలని చెప్పింది. ఈ నేపధ్యంలో మధ్యాహ్నం నుండి పాటియాలా హౌస్ కోర్టులో జరిగిన…

ఢిల్లీ కోర్టులో సుప్రీం కోర్టు ఆదేశాలకు దిక్కు లేదు!

నిన్నటి సుప్రీం కోర్టు గాండ్రింపులు పిల్లి కూతల కంటే అధ్వాన్నంగా మారిపోయాయి. ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఎందుకూ కొరగాకుండా పోయాయి. హిందూత్వ లాయర్ల వీరంగం ముందు భారత పార్లమెంటు, భారత న్యాయ చట్టాలు, పోలీసు వ్యవస్ధ… చేష్టలుడిగి నిలబడిపోయాయి. కన్హైయా కుమార్ ను హాజరుపరచవలసిన పాటియాలా కోర్టు ఆవరణలోకి చొచ్చుకు వచ్చిన హిందూత్వ గూండాలు -వారిలో కొందరు లాయర్లూ ఉండవచ్చు- జే‌ఎన్‌యూ విద్యార్ధులు, ప్రొఫెసర్లు, విలేఖరుల మీద మంగళవారం దాడి…

అసలు సమస్యలను తప్పించిన JNU-అఫ్జల్ రగడ!

ఏది దేశ ద్రోహం? ఏది దేశభక్తి? నిత్యం భావ సంఘర్షణలు జరిగే సమాజంలో ఉక్కు ద్రావకాన్ని పోత పోసి ఆరబెట్టినట్లుగా దేశభక్తి, దేశద్రోహం ఉండగలవా? ఉనికిలో ఉన్న మనుషులు అందరికీ ఒకటే దేశ భక్తి, ఒకటే దేశ ద్రోహం ఉండగలవా? మనిషి మెదడు వేనవేల ఆలోచనలకు నిలయం. మనిషి సామాజిక ఆచరణ ఎన్ని పోకడలు పోతుందో అన్ని పోకడలూ పొందగల వేలాది సంభావ్యతలు (probabilities) మనిషి మెదడులో వీరంగం ఆడుతుంటాయి. సమూహంలోని మనుషుల సామాజిక ఆచరణలో ఉమ్మడితనం…

పాక్ అనుకూల నినాదాలు చేసింది ఏ‌బి‌వి‌పి? -వీడియో

జవహర్ లాల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (జే‌ఎన్‌యూ‌ఎస్‌యూ) అధ్యక్షుడు కనహైయా కుమార్ పై ‘దేశ ద్రోహం’ కేసు మోపి ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇపుడీ వ్యవహారం సరికొత్త మలుపు తీసుకుంది. అఫ్జల్ గురును ఉరి తీసి 3 సం.లు పూర్తయిన సందర్భంగా ఫిబ్రవరి 9 తేదీన జే‌ఎన్‌యూ లో జరిగిన ఓ కార్యక్రమంలో విద్యార్ధి సంఘం అధ్యక్షులు, మరి కొందరు విద్యార్ధులు పాక్ అనుకూల, ఇండియా వ్యతిరేక నినాదాలు చేశారని ఆరోపిస్తూ కేంద్ర…

ఫాసిజం: జే‌ఎన్‌యూ విద్యార్ధి నేత అరెస్ట్

హిందూత్వ ఫాసిజం తన ఫాసిస్టు ప్రయాణంలో మరో అడుగు వేసింది. ఈసారి జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పంజా విసిరింది. విద్యార్ధుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అపహాస్యం చేస్తూ యూనివర్సిటీ విద్యార్ధి సంఘం అధ్యక్షుడు కన్హైయా కుమార్ పైకి ఢిల్లీ పోలీసులను ఉసి గొల్పింది. యూనివర్సిటీ విద్యార్ధులపై కఠిన చర్య తీసుకోవాలని తానే ఆదేశించానని కేంద్ర హోమ్ మంత్రి సగర్వంగా చాటుకున్నారు. యూనివర్సిటీ విద్యార్ధులు ‘జాతీయ-వ్యతిరేక’ భావోద్వేగాలు వ్యక్తం చేశారని కేంద్ర హోమ్ మంత్రి ఎకాఎకిన నిర్ధారించేశారు.…