దేవయాని: ప్రాసిక్యూషన్ కే అమెరికా నిర్ణయం

దేవయాని కేసు విషయంలో తెరవెనుక చర్చలు విఫలం అయినట్లు కనిపిస్తోంది. ఇంటి పని మనిషికి వేతనం చెల్లింపులో మోసానికి పాల్పడ్డారని ఆరోపించిన అమెరికా, దేవయాని ప్రాసిక్యూషన్ విషయంలో ముందుకు వెళ్లడానికే నిర్ణయించుకుందని తాజా వార్తలను బట్టి తెలుస్తోంది. అరెస్టు అయ్యే సమయానికి దేవయాని ఐరాస తాత్కాలిక సలహాదారుగా పూర్తి స్ధాయి రాయబార రక్షణ కలిగి ఉన్నారని భారత ఐ.ఎఫ్.ఎస్ అధికారులు కనుగొన్నప్పటికీ అమెరికా వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. అసలు కేసు పెట్టడానికి తగిన పునాది లేదని దేవయాని…

పనిమనిషిని మోసం చేసి అరెస్టయిన భారత రాయబారి

న్యూయార్క్ లోని భారత రాయబార కార్యాలయంలో డిప్యుటి కాన్సల్ జనరల్ గా పని చేస్తున్న అధికారి ‘వీసా మోసం’ కేసులో అరెస్టయ్యారు. వీసా మోసం, తప్పుడు సమాచారం కేసుల్లో సదరు రాయబారి అరెస్టయినప్పటికి అసలు విషయం పని మనిషికి వేతన చెల్లింపులో మోసం చేయడం. పని మనిషికి అమెరికా వీసా సంపాదించడానికి అమెరికా చట్టాల ప్రకారం నెలకు వేతనం 4,500 డాలర్లు చెల్లిస్తానని చెప్పిన రాయబార అధికారి వాస్తవంలో రు. 30,000/- (500 డాలర్ల కంటే తక్కువ)…

కనీస వేతనాలకు ప్రధాన మంత్రే అడ్డం!

భారత దేశం అతి పెద్ద ప్రజాస్వామ్యం అని చెబుతుంటారు. ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా దేశం లోపలా, బయటా తనకు అవసరం అనిపించినప్పుడల్లా ఆ సంగతి చెప్పుకుని మురిసిపోతుంటారు. ప్రజల ఓట్లతో అధికారం సంపాదించాక కనీసంగానైనా జనం గురించి పట్టించుకోకపోతారా అని సాధారణంగా మనమూ అనుకుంటాం. కానీ ఉపాధి హామీ పధకం కింద పని చేస్తున్న కూలీలకు కనీస వేతనం చెల్లించడానికి ప్రధానమంత్రి, ఆయన కార్యాలయమే సైంధవుడిలా అడ్డు పడుతున్న సంగతి వెలుగులోకి వచ్చింది. కర్ణాటక హై…

హాంకాంగ్‌లో మొట్టమొదటి సారిగా “కనీస వేతన చట్టం”

హాంకాంగ్‌లో మొదటిసారిగా కనీస వేతన చట్టం ప్రవేశపెట్టారు. 125 వ అంతర్జాతీయ కార్మిక దీక్షా దినోత్సవం రోజున హాంకాంగ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హాంకాంగ్‌ను 1997 లో బ్రిటిష్ చేతినుండి చైనా ఆధీనంలోకి వచ్చింది. ప్రజాస్వామ్య బ్రిటన్ పాలనలో శ్రమ చేసే ప్రజలకు కనీస వేతన చట్టం లేకపోవడంతోటే బ్రిటన్‌కి ప్రజాస్వామ్య విలువల పట్ల ఉన్న గౌరవం తెలుపుతోంది. ప్రజాస్వామ్య సంస్కరణలు అమలు చేయాలని ఈ బ్రిటన్ లాంటి దేశాలు చైనాను డిమాండ్ చేస్తున్న నేపధ్యంలో,…