నా గొయ్యి నువ్వు, నీ గొయ్యి నేను -కార్టూన్

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రుల వ్యవహారం ఇది. ప్రజల్లో ఒకరిని మరొకరు పలుచన చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న దాయాది ముఖ్యమంత్రులు ఒకరి గొయ్యి మరొకరు తవ్వుకుంటూ ఇద్దరూ గోతిలో పడిపోతున్నారు. వ్యక్తిగతంగా, రాజకీయంగా చూస్తే ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల పైనా జాలి చూపాల్సిన పరిస్ధితి కావచ్చు గానీ ప్రజల కోణంలో నుండి చూస్తే ఇరువురి చర్యల వల్ల వారి వారి అసలు రంగు బయటపడుతున్నందుకు ఆనందించాల్సిన సంగతి. శాసన మండలి సభ్యుల ఎన్నికల సందర్భంగా టి.డి.పి…

‘ఓటుకు నోటు’ కేసులో రెండవ అరెస్టు, ఈ సారి బిజెపి వంతు?

సుప్రీం కోర్టు జోక్యంతో “ఓటుకు నోటు” కేసు ముందుకు కదులుతున్నట్లు కనిపిస్తోంది. ముగ్గురు బి.జె.పి ఎం.పిలు యు.పి.ఎ-1 ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయకుండా ఓటింగ్ నుండి నిష్క్రమించడానికి కాంగ్రెస్ పార్టీవారు తమకు కోటి రూపాయలు ఇచ్చారంటూ, విశ్వాస పరీక్షరోజే ఆరోపించిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం ఈ కేసులో ఢిల్లీ పోలీసులు సమాజ్ వాదీ పార్టీ మాజీ నాయకుడు అమర్ సింగ్‌కు సయాయకుడుగా ఉన్న సంజీవ్ సక్సేనాను అరెస్టు చేశారు.…

పార్లమెంటు విశ్వాస పరీక్షలో ‘ఓటుకు నోట్లు’ కేసు దర్యాప్తుపై సుప్రీం కోర్టు ఆగ్రహం

2008 సంవత్సరంలో పార్లమెంటు విశ్వాసం పొందడం కోసం యు.పి.ఎ – 1 ప్రభుత్వం డబ్బులిచ్చి ప్రతిపక్షాల ఓట్లు కొన్న కేసులో దర్యాప్తు కొనసాగుతున్న తీరు పట్ల సుప్రీం కోర్టు శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు సంవత్సరాల నుండి కేసు విచారణలో పురోగతి లేకపోవడంతో ఢిల్లీ పోలీసుల పనితీరుపై అసహనం వ్యక్తం చేసింది. “ఢిల్లీ పోలీసులు చేసిన దర్యాప్తు పట్ల మేము ఏ మాత్రం సంతోషంగా లేము. ఇటువంటి తీవ్రమైన నేరంతో కూడిన అంశంలో, నేరం…

వికీలీక్స్ ను నమ్మలేం -ప్రధాని మన్మోహన్

యు.పి.ఏ – 1 ప్రభుత్వం 2008 సంవత్సరంలో విశ్వాస పరీక్ష నెగ్గడానికి లంచాలు ఇచ్చిందన్న ఆరోపణను భారత ప్రధాని మన్మోహన్ తిరస్కరించాడు. మా ప్రభుత్వం లో ఎవరూ ఆ సమయంలో అనైతిక కార్యకలాపాలకు పాల్పడలేదని ఆయన పార్లమెంటుకు చెప్పాడు. ప్రతిపక్షాలు “ఊహాత్మక, నిర్ధారించని, నిర్ధారించలేని” ఆధరాలతో ఆరోపణలు చేస్తున్నాయని సభకు తెలిపాడు. గురువారం సభలో జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ మన్మోహన్ “వికీలీక్స్” సంస్ధ నమ్మదగినది కాద”ని అన్నాడు. “అసలు వికీలీక్స్ ఉనికినే ప్రభుత్వం గుర్తించడం లేదని…

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ‘ఓటుకు నోటు’ సర్వసాధారణం -వికీలీక్స్

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో నోట్లతో ఓట్లు కొనడం సర్వసాధారణమని అమెరికా డెప్యుటీ రాయబారి అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ కి పంపిన కేబుల్ లో పేర్కొన్నాడు. 2009 లోక్ సభ ఎన్నికల్లో రాజకీయ నాయకులు వారి అనుచరులు డబ్బులు పంచామని రాయబారి దగ్గర అంగీకరించినట్లుగా వికీలీక్స్ బైట పెట్టిన కేబుల్ ద్వారా తెలిసింది. నోట్లే కాకుండా వినియోగ సరుకులు, సేవలు కూడా ఓట్ల సంపాదనకి వినియోగించారు. చెన్నైలోని అమెరికా రాయబార కార్యాలయంలో ఏక్టింగ్ ప్రిన్సిపల్ ఆఫీసర్ గా పనిచేసిన…