$800 కి ఒప్పుకుని $30 ఇచ్చి దొరికిపోయిన ఒబామా భద్రతాధికారులు

ఒక రాత్రికి 800 డాలర్లు ఇస్తామని ఒప్పుకున్న అమెరికా భద్రతాధికారులు సేవ ముగిశాక 30 డాలర్లు మాత్రమే ఇచ్చి మోసం చేయడంతో పోలీసులకి పట్టుబడ్డారని బి.బి.సి తెలిపింది. కొలంబియా లో జరిగిన ‘ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికా స్టేట్స్’ (ఒ.ఎ.ఎస్) కాన్ఫరెన్స్ కి హాజరయిన బారక్ ఒబామా భద్రత కోసం కొలంబియా వెళ్ళిన అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు వ్యభిచారం చేసి దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఒప్పుకున్న మొత్తాన్ని చెల్లించకుండా ఒబామా భద్రతాధికారి మోసం చేయబోవడంతో మహిళ ఆగ్రహం…

అమెరికా పెత్తనాన్ని లాటిన్, కరీబియన్ దేశాలు ఇక సహించవు -బొలీవియా

ప్రపంచ దేశాల నుండి మమ్మల్ని ఒంటరి చేయాలని అమెరికా ఇంకా ప్రయత్నిస్తూనే ఉందనీ కానీ ఆ శకం ముగిసిందనీ బొలీవియా అధ్యక్షుడు ‘ఇవా మొరేల్స్’ అన్నాడు. సంవత్సరాల తరబడి అమెరికా పెత్తనాన్ని ఎదుర్కొన్న లాటిన్ అమెరికా దేశాలు ఇప్పుడు దానికి వ్యతిరేకంగా తిరుగుబాటు ధోరణిలో ఉన్నాయనీ, అమెరికా పెత్తనాన్ని లాటిన్, కరీబియన్ దేశాలు ఇక సహించవనీ ‘ఇవా మోరేల్స్’ వ్యాఖ్యానించాడు. ‘ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్’ (ఒ.ఎ.ఎస్) సమావేశాలు సోమవారం ముగిసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యానాలు…

వ్యభిచారం స్కాండల్ లో ఒబామా సెక్యూరిటీ సిబ్బంది

ఒబామా భద్రత కోసం విదేశాల్లో విధులు నిర్వహించడానికి పోయి వ్యభిచారం చేస్తూ పట్టుబడిన ఒబామా సెక్యూరిటీ సిబ్బంది వ్యవహారం ఇది. శని, ఆదివారాల్లో కొలంబియాలోని కార్టాజినా నగరంలో అమెరికా రాజ్యాల సంస్ధ (ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికా స్టేట్స్ -ఓ.ఏ.ఎస్) సమావేశాలు జరగనున్నాయి. ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలకు చెందిన ముప్ఫైకి పైగా దేశాల ప్రధాన మంత్రులు, అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరవుతారు. వారిలో ఒబామా ఒకరు. ఒబామా భద్రత కోసం కొలంబియా వెళ్ళిన వ్యక్తిగత భద్రతా సిబ్బంది…