భారత్ పై అతి కేంద్రీకరణే లాడెన్ హత్యకు అవకాశం -పాక్ రిపోర్ట్

భారత దేశంతో ఉన్న సరిహద్దులపై అతిగా దృష్టి కేంద్రీకరించడం వల్లనే అమెరికా నేవీ సీల్ బృందం, పాకిస్ధాన్ లోకి చొరబడి ఒసామా బిన్ లాడెన్ ఇంటిపై దాడి చేయగలిగిందని పాకిస్ధాన్ విచారణ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. అమెరికా మిలట్రీ సంపాదించుకున్న స్టెల్త్ టెక్నాలజీ (సాధారణ పరిజ్ఞానానికి దొరకని విధంగా విమానాలు ఎగరగల సామర్ధ్యం) కూడా లాడెన్ ఇంటిపై దాడిని విజయవంతంగా పూర్తి చేయడానికి సహాయపడిందని సదరు నివేదిక తెలిపింది. మే 2, 2011 తేదీన…

బిన్ లాడెన్ వారసుడు, ఆల్-ఖైదా నాయకుడుగా డా. ఐమన్ అల్-జవహిరి నియామకం

ఒసమా బిన్ లాడెన్ హత్య జరిగిన ఆరు వారాల అనంతరం ఆయన వారసుడిని ఆల్-ఖైదా నియమించుకుంది. లాడెన్‌కి కుడిభుజంగా పేరుపొందిన ఐమన్ ఆల్-జవహిరి అందరూ భావించినట్లుగానే ఆల్-ఖైదా సుప్రీం నాయకుడుగా నియమితుడయ్యాడు. ఆల్-ఖైదా జనరల్ కమాండ్ ఈ నియామకం జరిపినట్లుగా ఆల్-ఖైదా మీడియా విభాగం ఒక మిలిటెంట్ల వెబ్ సైట్ లో ప్రకటించింది. “షేక్ డా. ఐమన్ ఆల్-జవహిరి, భగవంతుడు ఆయనను నడిపించుగాక, ఆల్-ఖైదా అమిర్ (నాయకుడు) గా భాధ్యతలు స్వీకరించాడు” అని ఆ ప్రకటన పేర్కొంది.…

ఒక తీవ్రవాది, ఒక స్నేహబంధం, కొన్ని కార్టూన్లు

అమెరికాకీ, అమెరికా వాదనని నమ్మినవారికీ ఒసామా బిన్ లాడెన్ నెం. వన్ తీవ్రవాది. దక్షీణాసియాలో అమెరికాకి పాకిస్ధాన్ అత్యంత నమ్మకమైన మిత్రుడు. వారిది ఆరు దశాబ్దాల స్నేహబంధం. లాడెన్‌ని వెతకటంలో తన మిత్రుడు సహాయపడుతున్నాడని అమెరికా సెప్టెంబరు 11, 2001 నుండి ఇప్పటి వరకు 20.7 బిలియన్ డాలర్లను పాకిస్ధాన్‌కి ధారపోసింది. పది సంవత్సరాల నుండీ వెతుకుతున్న తన శత్రువు తన మిత్రుడి బెడ్ రూంలోనే హాయిగా సేద తీరడం చూసిన అమెరికా బిత్తరపోయింది. మిత్రుడుగా భావిస్తున్న…

పాక్‌తో సంబంధాల మెరుగుకు అమెరికా ప్రయత్నాలు

సి.ఐ.ఏ ఏజెంట్ డేవిస్ అప్పగింత, ఒసామా బిన్ లాడెన్ హత్య లతో పాక్, అమెరికాల మధ్య అడుగంటిన సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి అమెరికా ప్రయత్నాలు ప్రారంభించింది. దాన్లో భాగంగా సెనేటర్ జాన్ కెర్రీ ఆఫ్ఘన్, పాక్ లలో పర్యటిస్తున్నాడు. వచ్చింది సంబంధాల మెరుగుకే అయినా పాక్ పై నిందలు మోపడం మానలేదు. ఒసామా బిన్ లాడెన్ ఆరు సంవత్సరాల పాటు పాక్ లో ఉండటానికి పాక్ సంస్ధల సాయం ఉందన్న విషయం నమ్మకాన్ని చెదరగోట్టేదని కెర్రీ ఆఫ్ఘనిస్ధాన్ లో…

అబ్బోత్తాబాద్‌ దాడిపై స్వతంత్ర దర్యాప్తు జరపాలి, డ్రోన్ దాడులు ఆపాలి -పాక్ పార్లమెంటు

పాకిస్ధాన్ పార్లమెంటు ఊహించని విధంగా ఓ ముందడుగు వేసింది. అది సంకేతాత్మకమే (సింబాలిక్) అయినప్పటికీ ఇప్పటి పరిస్ధితుల్లో అది ప్రశంసనీయమైన అడుగు. దాదాపు పది గంటలపాటు జరిగిన సుదీర్ఘ చర్చలో అమెరికన్ కమెండోలతో కూడిన హెలికాప్టర్లు మే 2 తేదీన అనుమతి లేకుండా పాకిస్ధాన్ గగనతలం లోకి జొరబడి అబ్బొత్తాబాద్ లో సైనిక చర్య చేపట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. అలాగే మానవ రహిత డ్రోన్ విమానాలు పాకిస్తాన్ ప్రభుత్వానికి ముందస్తు సమాచారం లేకుండా మిలిటెంట్లను…

బిన్ లాడెన్ హత్య ఆల్-ఖైదాపై ప్రభావం చూపుతుందా?

ఆల్-ఖైదాకు సంకేతాత్మకంగా నాయకత్వం వహిస్తూ వచ్చిన ఒసామా బిన్ లాడెన్ ను చంపేశామని అమెరికా అధ్యక్షుడు విజయ గర్వంతో ప్రకటించుకున్నాడు. హాలివుడ్ సినిమాల్లొ చూపినట్టు బిన్ లాడెన్ స్ధావరంగా చెబుతున్న ఇంటిలోకి అమెరికన్ కమేండోలు వెళ్ళడం అక్కడ ఉన్న ముగ్గురు యువకులను (ఒకరు లాడెన్ తనయుడుగా భావిస్తున్నారు) రక్తపు మడుగులో మునిగేలా కాల్చి చంపడం, బిన్ లాడెన్ తో ఉన్న అతని భార్యను మోకాలిపై కాల్చి అనంతరం లాడెన్ కంటిలోనా, గుండెపైనా కాల్చి చంపడం… వీటన్నింటినీ అమెరికా…

ఒసామా హత్యను నిర్ధారించిన ఆల్-ఖైదా, శవం అప్పగించాలని డిమాండ్

ఒసామా-బిన్-లాడెన్‌ నిజంగా అమెరికా కమెండోల దాడిలో చనిపోయాడా లేదా అన్న అనుమానాలకు తెర దించుతూ అతను చనిపోయిన విషయాన్ని ఆల్-ఖైదా సంస్ధ నిర్ధారించింది. లాడెన్ శవాన్ని అప్పగించాలని ఆల్-ఖైదా డిమాండ్ చేసింది. శవాన్ని అరేబియా సముద్రంలో పాతిపెట్టామంటున్న అమెరికా మాటలను ఆల్-ఖైదా నమ్మడం లేదని ఈ డిమాండ్ ద్వారా అర్ధం చేసుకోవచ్చునా లేక శవం పాతిపెట్టిన చోటుని చెప్పాలని ఈ డిమాండ్ అంతరార్ధమో తెలియడం లేదు. ఒసామా-బిన్-లాడెన్ హత్యకు అమెరికా పైనా, దాని మిత్రుల పైనా ప్రతీకారం…

ఇండియాతో ఘర్షణ పెట్టుకుని ఒసామా హత్యపై దృష్టి మరల్చే యోచనలో పాకిస్ధాన్?

పాకిస్ధాన్ భూభాగంపై స్ధావరం ఏర్పరుచుకున్న ఒసామా బిన్ లాడెన్‌ను చంపామని అమెరికా అధ్యక్షుడు ప్రకటించడంతో పాకిస్ధాన్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. పాకిస్ధాన్ ప్రభుత్వానికి తెలియకుండా అమెరికా ఆపరేషన్ నిర్వహించిందనడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నప్పటికీ ఇన్నాళ్ళూ ఒసామా పాకిస్ధాన్‌లోనే ఆశ్రయం తీసుకుంటున్న విషయం తెలిసి పాకిస్ధానీయులు నిశ్చేష్టులయ్యారని పత్రికలు తెలుపుతున్నాయి. పాకిస్ధాన్ ఐ.ఎస్.ఐ సంస్ధ లాడెన్‌ను తప్పిస్తుందేమో అన్న అనుమానాలున్నందునే పాక్ ప్రభుత్వానికి తెలియజేయలేదని సి.ఐ.ఏ డైరెక్టర్ చెప్పడంతో పాకిస్ధాన్‌లోని ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్త్తున్నాయి.…

లాడెన్ ఇంటిలో రక్తపు మడుగులో ముగ్గురు నిరాయుధుల శవాలు, ఫోటోలు సంపాదించిన రాయిటర్స్

ఒసామా బిన్ లాడెన్‌ స్ధావరంగా చెప్పబడుతున్న ఇంటిలో రక్తపు మడుగులో పడి ఉన్న ముగ్గురు యువకుల శవాల ఫోటోలను రాయిటర్స్ వార్తా సంస్ధ సంపాదించింది. వీరి వద్ద ఎటువంటి ఆయుధాలు లేవని రాయిటర్స్ సంస్ధ తెలిపింది. అమెరికా కమేండోలు దాడి చేసి వెళ్ళిన గంట తర్వాత ఈ ఫోటోలు తీశారని ఆ సంస్ధ తెలిపింది. పాకిస్ధాన్ భద్రతా అధికారి ఒకరు ఒసామా స్ధావరంగా చెబుతున్న ఇంటిలోకి అమెరికన్ కమెండోలు వెళ్ళిన గంట తర్వాత వెళ్ళి తీసిన ఫోటోలను…

ఒసామా మృతి తాలూకు ఫోటోల విడుదలకు భయపడుతున్న ఒబామా

ప్రపంచ పోలీసు అమెరికా అధ్యక్షుడు ఒబామాని చనిపోయిన ఒసామా బిన్ లాడెన్ ఇంకా భయపెడుతూనే ఉన్నాడు. ఒసామాని చంపినట్లు రుజువులు చూపాలని అమెరికాలోని వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ నాయకులతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల ప్రభుత్వాలు ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. కాని ఒసామా మృతి చెందిన ఫోటోలు విడుదల చేస్తే, భీకరంగా ఉన్న ఆ చావు వలన అమెరికా జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని తాను భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ఒబామా ఎన్.బి.సి టెలివిజన్‌కి ఇచ్చిన…

నిరాయుధుడు లాడెన్‌ను హత్య చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం

కమెండోలు దిగుతుండగానే లాడెన్ భవంతి నుండి కాల్పులు ఎదురయ్యాయనీ, లాడెన్ సాయుధంగా ప్రతిఘటించడంతోనే కాల్చి చంపామనీ మొదట చెప్పిన అమెరికా అధికారులు మెల్ల మెల్లగా నిజాలను ఒక్కొక్కటీ వెల్లడిస్తున్నారు. లాడెన్ భార్య దాడి చేయడంతో అమెనూ కాల్చి చంపామని చెప్పినవారు ఇప్పుడు ఆమె లాడెన్‌కు అడ్డుగా రావడంతో కాలిపై కాల్చామనీ, అమె బతికే ఉందనీ ఇప్పుడు చెబుతున్నారు. హెలికాప్టర్లపై కాల్పులు జరిగాయన్నవారు ఇప్పుడు దానిగురించి మాట్లాడ్డం లేదు. లాడెన్ సాయుధంగా ప్రతిఘటించాడన్న వారు ఇప్పుడు అతను నిరాయుధంగానే…

లాడెన్‌ని అమెరికా చంపినట్టే అమెరికాలో చొరబడి ముంబై దాడి నిందితుడు హేడ్లీని చంపేద్దామా!?

వరల్డ్ ట్రేడ్ సెంటర్ కి చెందిన జంట టవర్లను కూల్పించి మూడు వేల మంది అమెరికన్లను చంపాడన్న ఆరోపణపై ఒసామా-బిన్-లాడెన్ ను పాకిస్ధాన్‌కి చెప్పకుండా అతని ఇంటిపై దాడి చేసి చంపింది. “దాడి సంగతి మాకు తెలియదు” అని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్ధాన్ ప్రభుత్వానికి చెబితే ఒసామాను తప్పించవచ్చన్న అనుమానంతో వాళ్ళకి చెప్పలేదని సి.ఐ.ఏ డైరెక్టర్ టైమ్స్ మేగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టాడు. “మీ అబ్బాయిని చంపినవాడు మాయింట్లో దాచిపెడితే ఏం చేస్తావు? నా…

ప్రపంచ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన లాడెన్ మృతి, పైశాచికానందంలో దురాక్రమణ గుంపు

ఒసామా బిన్ లాడెన్‌ను ఎట్టకేలకు దురాక్రమణదారులు చంపగలిగారు. రెండు అగ్ర రాజ్యాల దురాక్రమణలను ఎదిరించి పోరాడిన బిన్ లాడేన్ హీరోచిత మరణం పొందాడు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కి చెందిన జంట టవర్లపై విమానాలతో డీకొట్టి కూల్చడం వెనక బిన్ లాడేన్ పధకం ఉందని యుద్ధోన్మాదుల మానస పు(ప)త్రికలు చేసిన ప్రచారంతో రెండు మదపుటేనుగులతో కలబడిన లాడెన్ ప్రతిష్ట తాత్కాలికంగా మసకబారవచ్చు. అచ్చోసిన ఆంబోతుల్లా ప్రపంచంపై బడి దేశాల సంపదలనన్నింటినీ కొల్లగొట్టే దుష్టబుద్ధితో వెంపర్లాడే అమెరికా నాయకత్వంలోని…