ఫ్రాన్స్ లో మరో కొత్త రకం కోవిడ్ వైరస్ ‘IHU’

ఇండియాలో ‘ఒమిక్రాన్’ వేరియంట్ విజృంభణ ఇంకా అందుకోనే లేదు, మరో కొత్త రకం కోవిడ్ వైరస్ ని ఫ్రాన్స్ పరిశోధకులు కనుగొన్నారు. ఆఫ్రికా దేశం కామెరూన్ నుండి తిరిగి వచ్చిన వ్యక్తిలో ఇండెక్స్ కేసు (మొదటి కేసు) కనుగొన్నట్లు ‘ఐ‌హెచ్‌యూ మేడిటెరనీ’ అనే పరిశోధనా సంస్థ ప్రకటించింది. దక్షిణ ఫ్రాన్స్ ఫ్రాన్స్ లో కనుగొన్న కొత్త రకం కోవిడ్ వైరస్ ను ఇప్పటికే 12 మందిలో కనుగొన్నారు. మ్యుటేషన్ పరిభాషలో ఈ రకాన్ని B.1.640.2 వేరియంట్ గా…