రిజర్వేషన్ల వల్ల లబ్ది పొందుతున్నది బ్యూరోక్రట్లు, రాజకీయ నాయకులే -సుప్రీం కోర్టు

రిజర్వేషన్ కోటాల వలన సమకూరుతున్న ఫలితాలను ఆ వర్గాలకు చెందిన రాజకీయ నాయకులు, బ్యూరోక్రట్ అధికారులు మాత్రమే లబ్ది పొందుతున్నారని సుప్రీం కోర్టు గురువారం వ్యాఖ్యానించింది. అవి ఎవరికైతే ఉద్దేశించబడ్డాయో వారికి అసలు రిజర్వేషన్ల సంగతే తెలియడం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ కె.వి.రవీంద్రన్, జస్టిస్ ఎ.కె.పట్నాయక్ లతో కూడిన సుప్రీం కోర్టు బెంచి ఈ వ్యాఖ్యానాలు చేసింది. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జె.ఎన్.యు), ఢిల్లీ యూనివర్సిటీలలో జరిగే అడ్మిషన్లలో ఒ.బి.సి రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయడం…