ఒబామా పై హత్యా ప్రయత్నం, ఒకరి అరెస్టు

గత శుక్రవారం, నవంబరు 11 వ తేదీన వైట్ హౌస్ పై కాల్పులు జరిపిన నేరానికి 21 సంవత్సరాల యువకుడిపై అమెరికా ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడిపై హత్యా ప్రయత్నం నేరం మోపింది. బారక్ ఒబామాను “క్రీస్తు వ్యతిరేకి” గానూ, “దయ్యం” గానూ ‘అస్కార్ ఒర్టెగా-హెర్నాండెజ్ గా అభివర్ణించినట్లుగా తెలుస్తోంది. వైట్ హౌస్ పై కాల్పులు జరిగిన అనంతరం వైట్ హౌస్ అధికారులు వెంటనే కాల్పుల గురించి స్పందించలేదు. కాల్పులు జరిపిన వ్యక్తి కారులో పారిపోయినట్లుగా వార్తలు వెలువడ్డాయి…