ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు ఐరోపాయే పెద్ద ప్రమాదం -ఒ.ఇ.సి.డి

ఒ.ఇ.సి.డి = ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డవలప్ మెంట్ ఒ.ఇ.సి.డి అర్ధ వార్షిక సమావేశాలు బుధవారం పారిస్ లో జరిగాయి. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు ఐరోపా పెద్ద ప్రమాదంగా పరిణమించిందని ఈ సమావేశాల్లో సంస్ధ సమీక్షించింది. 34 ధనిక దేశాల కూటమిలో 24 దేశాలు ఐరోపాకి చెందినవే కావడం గమనార్హం. ఐరోపా ఆర్ధిక బలహీనత మరింత కాలం కొనసాగితే అది ఆర్ధిక స్తంభనకు దారి తీసి మొత్తం ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకే ముప్పుగా పరిణమిస్తుందని…

ఆర్ధిక మాంద్యం కోరల్లో 17 దేశాల యూరోజోన్ -ఒఇసిడి

ఋణ సంక్షోభం ఫలితంగా, 17 యూరప్ దేశాల ద్రవ్య యూనియన్ అయిన ‘యూరో జోన్’ లో ఆర్ధిక మాంద్యం (recession) బలపడుతోందని ఒఇసిడి (Organisation for Economic Coperation and Development) నిర్ధారించింది. తాను మాంద్యంలో కూరుకుపోతూ ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను కూడా అందులోకి ఈడుస్తోందని ప్యారిస్ లో విడుదల చేసిన మధ్యంతర నివేదికలో పేర్కొందని అసోసియేటెడ్ ప్రెస్ (ఎపి) వార్తా సంస్ధ తెలిపింది. యూరప్ నాయకురాలు జర్మనీ సైతం ఈ సంవత్సరాంతానికి మాంద్యంలోకి జారుతుందని ఒఇసిడి…