ఐ.పి.ఎల్ vis-a-vis సుప్రీం కోర్టు -కార్టూన్

బి.సి.సి.ఐ మాజీ అధ్యక్షుడు వి.శ్రీనివాసన్ పుణ్యమాని సుప్రీం కోర్టు కూడా ఐ.పి.ఎల్ పాలకవర్గంలో ఒక పాత్ర పోషిస్తోంది. ధర్డ్ అంపైర్ ధాటికి గ్రౌండ్ లో ఉన్న ఇద్దరు అంపైర్ల నిర్ణయ శక్తి దాదాపు నామమాత్రంగా మారిపోయినట్లే సుప్రీం కోర్టు ఇటీవల చూపుతున్న చొరవ వల్ల మొత్తం స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ స్వతంత్రతకు ప్రమాదం వచ్చినపడినట్లు కార్టూనిస్టు సూచిస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ ఆ గుర్రం ఎవరు? బహుశా క్రికెట్ ఆటగాళ్లకు, అంపైర్లకు, ఆటను చూసే ప్రేక్షక దేవుళ్ళకి ఎవరికీ కనపడకుండా…

జెంటిల్మెన్ గేమ్ రోజులు గతించాయా? -కార్టూన్

—*— గుర్తుంచుకోండి, ఇది జెంటిల్మెన్ గేమ్ కాదు. అంపైర్ ఔట్ ఇస్తే వెళ్లిపోవద్దు. ఆయన ఒత్తిడి చేస్తే కసి తీరా తిట్లకు లంకించుకోండి! జెంటిల్మెన్ గేమ్ అని క్రికెట్ ఆట గురించి చెబుతుంటారు. క్రికెట్ ఆట కోట్లు కురిపించే ఆటగా మారి అందులోకి రాజకీయ నాయకులు, కార్పొరేట్ కంపెనీలు ఎప్పుడైతే ప్రవేశించారో అప్పుడే అది క్రూడ్ మెన్ గేమ్ గా మార్పులు సంతరించుకుంది. కంటికి కనిపించే ప్రతిదీ సరుకుగా మారిపోతుందని కారల్ మార్క్స్ ఊరికే అన్లేదు. సరుకుగా…

క్రికెట్ ధన యజ్ఞంలో సమిధలు ఆటగాళ్లు

కేరళ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ లో దొరికిపోయాడు. అతనితో పాటు రాజస్ధాన్ రాయల్స్ కి చెందిన మరో ఇద్దరు ఆటగాళ్లను ఢిల్లీ పోలీసులు గురువారం తెల్లవారు ఝామున అరెస్టు చేయడంతో ఐ.పి.ఎల్ స్పాట్ ఫిక్సింగ్ విషయాలు బైటికి వచ్చాయి. ఏప్రిల్ నుండే తాము ఆటగాళ్ల పైనా, బుకీల పైనా నిఘా పెట్టామని వారిని తప్పులు చేయనిచ్చి అరెస్టు చేశామని పోలీసులు సగర్వంగా, సంచలనాత్మకంగా ప్రకటించారు. జాతీయ జట్టు కెప్టెన్ ధోనీయే కుట్ర చేసి తమ…