స్పాట్ ఫిక్సింగ్ వెనక దావూద్, ఛోటా షకీల్

పీట ముడి పడిందో, విడిపోయిందో గానీ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, అతని అనుచరుడు ఛోటా షకీల్ ల పాత్ర ఉన్నదని కనుగొన్నామని పోలీసులు ప్రకటించేశారు. దానితో స్పాట్ ఫిక్సింగ్ నిందితులు అందరిపైనా MCOCA (Maharashtra Control of Organised Crimes Act) చట్టం కింద కేసులు పెడుతున్నామని వారు తెలిపారు. వారిలో శ్రీశాంత్ కూడా ఉన్నాడు. బుకీలు బెదిరించి ఆటగాళ్లను లొంగదీసుకున్నారని కూడా పోలీసులు చెబుతున్నారు. దావూద్ ముఠా ఆదేశాల…

మోడి నోరు తెరవరేమి? -కార్టూన్

— “కొద్దిగా మార్పులు చేసి వాటిని మీరు ఉపయోగించొచ్చు కదా!” — ఐ.పి.ఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం విషయంలో దాదాపు అందరూ ఏదో ఒక మాట అనేశారు. భావి ప్రధాని కావాలని ఆశిస్తున్న మోడి మాత్రం ఎందుకో ఇంకా నోరు తెరవలేదు! మోడి అటెన్షన్ కోరడానికి కారణం ఆయన కూడా బి.సి.సి.ఐ బోర్డు సభ్యుడు కావడమే. గుజరాత్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడిగా ఆయన కూడా బి.సి.సి.ఐ బోర్డు సభ్యులే. అవడానికి క్రికెట్ ఆట బోర్డే అయినా దాని…

రెంటల్ మేన్స్ గేమ్ -కార్టూన్

ఐ.పి.ఎల్ కుంభకోణం గురించి పత్రికల్లో కార్టూన్ల వరద పారుతోంది. జెంటిల్మెన్ గేమ్ గా గొప్పలు చెప్పుకున్న గేమ్ కాస్తా రెంటల్మెన్ గేమ్ గా మారిపోయిందని కార్టూనిస్టు నవరే శ్రేయాస్ వినూత్న రీతిలో స్పష్టం చేస్తున్నారు. ఐ.పి.ఎల్ లో పాత్రధారులైన వివిధ సెక్షన్లకు కుంభకోణం దరిమిలా అది ఒక్కో కంటికి ఎలా కనిపిస్తోందో కార్టూనిస్టు విశ్లేషించారు. ఒక్కోక్కరికి ఒక్కో విధంగా కళ్ళు మూసుకుపోయాయని కూడా ఈ కార్టూన్ కి అర్ధం తీసుకోవచ్చు. ఆటగాళ్లకు డబ్బు తప్ప ఆట కనిపించడం…

ఐ.పి.ఎల్ ఫిక్సింగ్: విందూ, చెన్నై యజమాని పందెందారు

చనిపోయిన మాజీ నటుడు దారాసింగ్ తనయుడు విందూ దారా సింగ్, చెన్నై సూపర్ కింగ్స్ యజమాని, బి.సి.సి.ఐ కార్యదర్శి శ్రీనివాసన్ అల్లుడు గురునాధ్ మీయప్పన్ తరుపున అనేకసార్లు పందెం కాసినట్లు తెలుస్తోంది. మీయప్పన్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సి.ఐ.ఓ (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) కూడా. అనేకమంది ప్రముఖుల పేర్లను కూడా విందూ సింగ్ చెన్నై పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. అనేకమంది సినిమా తారలు, పేరు మోసిన మాజీ క్రికెటర్, ప్రస్తుతం కామెంటేటర్లుగా వ్యవహరిస్తున్న ప్రముఖ మాజీ…

ఐ.పి.ఎల్ మాయల బూరోడు -కార్టూన్

పైడ్ పైపర్ అనేది జర్మనీలో బహుళ ప్రచారంలో ఉన్న ఒక కధ. ఓ చిన్న నగరానికి ఎలుకలు పెద్ద బెడదగా ఉండేవిట. వాటిని వదిలించుకోడానికి నగర జనం, అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు. ఒకసారి బూర (పైపర్) ఊదుకుంటూ రంగు రంగుల దుస్తులు ధరించిన ఒక వ్యక్తి ఆ నగరానికి వచ్చాడు. ఎలుకలను తాను తరిమేస్తానని, అందుకు తనకు తగిన ఫలితం ఇవ్వాలని కోరాడాయన. ప్రజలు, మేయర్ చర్చించుకుని పెద్ద మొత్తం ఇవ్వడానికి సరేనన్నారు.…

పిల్ల ఫిక్సింగ్ ముఠా అణచివేతలో భాగంగా శ్రీశాంత్ బుక్కయ్యాడా?

ఈనాడు పత్రిక ప్రకారం క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ లు, స్పాట్ ఫిక్సింగ్ లు అన్నీ కలుపుకుని ఈసారి చేతులు మారిన మొత్తం అక్షరాలా రు. 47,000 కోట్లు. ఇది గత సంవత్సరం రు. 43,000 కోట్లట. అంటే 2జి, బొగ్గు కుంభకోణాలను తలదన్నే మొత్తాలు క్రికెట్ ఫిక్సింగ్ వ్యాపారంలో ఇమిడి ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తాల్లో శ్రీశాంత్, చండీలా, చవాన్ లకు అందింది కోటి రూపాయలకు మించలేదు. మరి మిగిలిన మొత్తం ఎవరి చేతులకు చేరినట్లు, ఎవరి…

ఐ.పి.ఎల్: పిచ్ చూసి చెబుతాం… ఎవరు ఆడతారో -కార్టూన్

పిచ్ ను బట్టి ఏయే దేశాల వాళ్లు ఆడవలసి ఉంటుందో కెప్టెన్ నిర్ణయించ వలసిన రోజులు వచ్చేసాయి. ఏ దేశం వాళ్లు ఆడగూడదో చెప్పాక, ఏయే దేశాల వాళ్లు ఆడతారో కూడా చెప్పాలి కదా! ది హిందూ కార్టూనిస్టు సురేంద్ర ఆ విషయమే చెబుతున్నారు, ఈ కార్టూన్ ద్వారా. లేకపోతే, ఐ.పి.ఎల్ మ్యాచుల్లో ఒక దేశానికి చెందిన ఆటగాళ్లు ఆడగూడదని రాజకీయ నాయకులు నిర్ణయించడం ఎమిటి, విడ్డూరం కాకపోతే. అది కూడా ఒక రాష్ట్రంలో ఆడే మ్యాచ్…

జయ హుకుం, ఐ.పి.ఎల్ జో హుకుం

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత భారత ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు సంధించిన లేఖాస్త్రం, ఐ.పి.ఎల్ పాలిట బ్రహ్మాస్త్రమే అయింది. తమిళనాడులో ‘అమృత యూనివర్సిటీ‘ లాంటి ప్రధాన విద్యా సంస్థలు సైతం యూనివర్సిటీని మూసేసి విద్యార్ధులకు సెలవులిచ్చి ఇళ్లకు పంపేందుకు దారి తీసిన ఆందోళనలు ఇపుడు శ్రీలంక ఐ.పి.ఎల్ ఆటగాళ్ళకు ‘ఆట‘విడుపును సమకూర్చాయి. జయలలిత ‘హుకుం‘ జారీ చేయగా, ఐ.పి.ఎల్ గవర్నింగ్ బాడీ ‘జో హుకుం‘ కొట్టి సలాము చేసింది. చెన్నైలో జరిగే ఐ.పి.ఎల్ మ్యాచ్ లకు…