ఐ.పి.ఎల్ కుంభకోణం: శ్రీనివాసన్, దిగిపో! -సుప్రీం

భారత క్రికెట్ సామ్రాజ్యాన్ని ఏలుతున్న శ్రీనివాసన్ కు ఊహించని వైపు నుండి కొరడా దెబ్బ ఛెళ్ మని తగిలింది. ఐ.పి.ఎల్ కుంభకోణం నేపధ్యంలో ఒకవైపు చెన్నై సూపర్ కింగ్స్ టీం యజమానిగా ఉంటూ మరోవైపు బి.సి.సి.ఐ అధిపతిగా ఎలా కొనసాగుతారని ప్రశ్నించింది. అల్లుడి మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ కార్యకలాపాలపై నిస్పాక్షిక విచారణ జరగాలంటే బి.సి.సి.ఐ అధ్యక్ష పదవికి శ్రీనివాసన్ రాజీనామా చేయవలసిందేనని తేల్చి చెప్పింది. ‘మీరే తప్పుకుంటారా లేక మమ్మల్ని తప్పించమంటారా?’ అని సూటిగా ప్రశ్నించింది. కమిటీ…