‘ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్’ దిశ ఎటు? -కార్టూన్

అన్నా హాజరే, అరవింద్ కేజ్రీవాల్ తదితరుల నేతృత్వంలో దాదాపు సంవత్సరం క్రితం అట్టహాసంగా ప్రారంభమయిన ‘అవినీతి వ్యతిరేక ఉద్యమం’ ఇపుడు క్రియాశీలక మద్దతుదారులు లేక మూలపడింది. నాయకత్వం చెరోదారి పట్టడంతో ఐ.ఎ.సి కి ఇపుడు దిశ లేకుండా పోయింది. దారులు చీలినప్పటికీ ఒకేవైపుకి ప్రయాణం కొనసాగితే లక్ష్యం వద్దనయినా కలుసుకోవచ్చు. చివరి పోరాటంలోనైనా భుజం భుజం కలపొచ్చు. ‘మార్గాలు వేరైనా లక్ష్యం ఒక్కటే’ అని చీలిక సమయంలో ప్రకటించిన ఇరు వర్గాలు ఇపుడా స్ఫూర్తిని ప్రదర్శించడం లేదు.…

నక్సల్ జిల్లాల్లో పోలీసులకి రు.800 కోట్లు, ప్రజలకి రు.30 కోట్లు

దేశంలో నక్సల్ పీడిత జిల్లాలలో దుర్భేధ్యమైన కోటల్లాంటి పోలీసు స్టేషన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభ్యుత్వం రు.120 కోట్లు మేరకు విడుదల చేసింది. పోలీసు ఠాణాల నిర్మాణం కోసం విడుదల చేస్తున్న ఈ సొమ్ము కేవలం మొదటి వాయిదా మాత్రమే.  మరింత సొమ్ముని మరిన్ని వాయిదాలలో విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా నక్సల్ పీడిత జిల్లాలలోని ప్రజలకు సౌకర్యాలు కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం 2010-11 లో కేవలం రు.25 కోట్లు మాత్రమే…